చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సిసిపిఎల్ చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ లోగోను శనివారం రోజున సిఐ మల్లేష్ ఎస్సై శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత మూడు సంవత్సరాలు గా చిట్యాల మండల కేంద్రం లో
నిర్వహిస్తున్న సీసీపీఎల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుంది, గ్రామీణ ప్రాంతమైన చిట్యాల్లో ఇంత పెద్ద స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు
అనంతరం నూతన లోగో నీ ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో సి సి పి ఎల్ 3 అధ్యక్షుడు ఇరుకులపాటి వినయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి మాటూరు లవన్ బాబు, ఉపాధ్యక్షులు గడ్డం సాయి నితిన్ , బైరమ్ శివ కోశాధికారి వేల్పుల రాజు కుమార్ పాల్గొనడం జరిగింది.