శంకుస్థాపన చేసిన ప్రత్యేకాధికారి తహశీల్దార్ శేఖర్!!!
జగిత్యాల నేటి ధాత్రి
వెల్గటూర్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా ధర్మపురి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ మంజూరు చేయించిన15 లక్షల నిధులతో చేపట్టిన నూతన సీసీ రోడ్డు నిర్మాణం పనులకు జిపి ప్రత్యేకాధికారి తహశీల్దార్ శేఖర్ శంకుస్థాపన చేశారు. ఇవేగాక అట్టి నిధులతో పలు అభివృద్ధి పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇట్టి నిధుల మంజూరుకి కృషి చేసిన ధర్మపురి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ ,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, బందెల ఉదయ్ గౌడ్, గండ్ర శ్రీకాంత్ రావు, మెరుగు నరేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుమ్ముల మల్లేష్, గుమ్ముల వెంకటేష్, గుమ్ముల సతిష్, ద్యావనపల్లి శ్రీనివాస్, గుమ్ముల అజయ్,జూపాక ప్రవీణ్, ముద్రకోల వేణు,నవల్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
