balaji techno school nirvakam, బాలాజీ టెక్నో స్కూల్‌ నిర్వాకం

బాలాజీ టెక్నో స్కూల్‌ నిర్వాకం

నర్సంపేట లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్‌లో వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆర్జేడీ, ఇంచార్జి డీఈవో టీ.రాజీవ్‌, ఎంఈఓ దేవా తదితరులు పాల్గొన్నారు. బాలాజీ టెక్నో స్కూల్‌ యాజమాన్యం అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వస్తున్న విషయాన్ని తెలుసుకుని విద్యార్థులను దాచేశారు. తరగతి గదుల్లో విద్యార్థుల పుస్తకాలు లభ్యం కాగా, అందులో కొద్దిరోజులుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుల సంతకాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతకు ముందురోజు తరగతుల నిర్వహణపై వచ్చిన సమాచారంతో సీఆర్పీ శ్రీనివాస్‌ అక్కడికి వెళ్లి ఫొటోలు తీసి అధికారులకు చెప్పాడు. ఇంతలోనే బాలాజీ టెక్నో విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఏ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి చేరుకొని అతని వద్ద గల సెల్‌ఫోన్‌ లాక్కొని నానా దుర్భాషలు ఆడుతూ బెదిరించి వెళ్లగొట్టాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారి ఆదేశానుసారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విధినిర్వహణకు అడ్డుపడి ఆధారాలు కలిగిన సెల్‌ఫోన్‌ లాక్కొన్నాడంటూ శ్రీనివాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో పాఠశాల నిర్వహించడంతోపాటు సీఆర్పీ శ్రీనివాస్‌పై దౌర్జన్యానికి దిగిన సంఘటనపై ఆర్జేడీ రాజీవ్‌ జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.

endalo jagratha, ఎండలో జాగ్రత్త

ఎండలో జాగ్రత్త

జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన జారి చేసారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉండడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు వద్ధులు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా గురి అవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో రావాల్సివస్తే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుబయట పనిచేసేవారు ఎండ తీవ్రత నుంచి తగిన రక్షణ పొందాలని, పలుచని మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణాలను ఎక్కువగా తీసుకుంటే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. విపరీతమైన తలనొప్పి, తల తిరగడం, తీవ్రంగా జ్వరం కల్గి ఉండడం, మగత నిద్ర, కలవరింతలు, ఫిట్స్‌, పాక్షికంగా అపస్మారక స్థితిలో ఉంటే వడదెబ్బ లక్షణాలుగా గుర్తించి బాధితుడిని డాక్టరుకు చూపించాలన్నారు. వెంటనే ప్రథమ చికిత్స అందజేయాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చడం, శరీర ఉష్ణోగ్రత సాధారణస్థాయికి వచ్చే వరకు చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవటంతోపాటు ఉప్పు కలిపిన మజ్జిగ, చిటికెడు ఉప్పు కల్గిన గ్లూకోజు ద్రావణం, ఒఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలని పేర్కొన్నారు. ఎండలకు బయటికి వచ్చేటప్పుడు మాత్రం చల్లని మజ్జిగ, నిమ్మరసం, మంచినీరు తాగాలని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్యం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వడదెబ్బ తగిలిన వ్యక్తులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని అన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తులు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే మెరుగైన చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని, స్వచ్చంద సంస్థలు ఎండ తీవ్రతతో కలిగే నష్టాలను ప్రచారం చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు.

వడదెబ్బ లక్షణాలు

1. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే సమయంలో ప్రజలు బయటకు వెళ్లడం, పనిచేయడం మంచిది కాదని, చల్లని నీరు ఎక్కువగా తీసు కోవాలని తెలిపారు.

2. ప్రజలు తప్పని పరిస్థితులలో ఎండలోనికి వెళ్లవలసి వస్తే గొడుగు, తలపై టోపీ, కళ్లకు కూలింగ్‌ అద్దాలు ఉపయోగించాలని చెప్పారు.

3. కూలి పనులకు వెళ్లేవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా తక్కువ ఎండ ఉన్నపుడు పనులు చేసుకుంటే మంచిదని సూచించారు.

4. ఎండ వేడిమికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉంటే తక్షణమే డాక్టర్లను సంప్రదించడం మంచిదని,

వడదెబ్బ వచ్చే అనుకూలతలు చిన్న పిల్లల్లో, వద్ధుల్లో ఎక్కువగా వడదెబ్బ వస్తుందని, ఎండలో ఎక్కువగా పనిచేయడం వల్ల కానీ, ఎక్కువగా తిరగటం వల్ల వడదెబ్బ తగులుతుందని తెలిపారు. ఎండలో, గాలిలేని చోట పనిచేస్తే తక్కువ నీరు, ఉప్పు లవణ ద్రావణాలు తీసుకోకపోవడం వల్ల వడదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు.

వడదెబ్బకు ప్రథమ చికిత్స

1. వడదెబ్బకు గురైనట్లు అనుమానం ఉంటే అటువంటి వారిని ఎండ నుంచి గాలి, వెలుతురు, నీడ ఉన్న ప్రదేశానికి వెంటనే తర లించాలని సూచించారు.

2. శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించుకునేందుకు చల్లని నీటితో తడిసిన గుడ్డతో శరీరం అంతటా తుడుస్తూ ఉండాలని అన్నారు.

3. వడదెబ్బకు గురైన వారు ధరించిన దుస్తులు వదులు చేయాలని, చల్లటి గాలి ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

4. వడదెబ్బకు గురైన వారు క్రమం తప్పకుండా చల్లటి నీరు తాగుతూ ఉండాలని చెప్పారు.

వడదెబ్బ తగులకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలో ఎక్కువగా తిరగరాదని, ఎండలో తిరిగేటప్పుడు తలకు టోపీ, గొడుగు, టవల్‌ కానీ ఉపయోగించాలని, ఎక్కువగా పనిచేయకూడదని, ఒకవేళ పనిచేయాల్సి వస్తే ఎక్కువ నీరును ఉప్పుతో కలిపి తీసుకోవాలని సూచించారు. మధ్యమధ్యలో విశ్రాంతి తీసు కుంటూ ఉండాలని, వేడి తాపం వల్ల మొదట కండరాల నొప్పి, అలసట కలుగుతుందని, చెమట ద్వారా శరీరంలోని నీరు బయటకు వెళ్తుందని అన్నారు. దీనిని ఎండ అలసట అంటారని, ఎండలో అలాగే పనిచేస్తే మనిషి అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపారు. ఆ సమయంలో ఉప్పు కలిపిన నీటిని తాగాలని, ఎక్కువ ఎండ అలసట వస్తే నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని తడిపి చల్లగాలి తగిలేలా పడుకోబెట్టాలని అన్నారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని, అప్పటికీ తగ్గకుండా ఉంటే డాక్టరును సంప్రదించాలని, ప్రజలంతా తప్పనిసరిగా పైసూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ennikala sadarana parishilakuluga sharavanan, ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శరవణన్‌

ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శరవణన్‌

జిల్లాలో జరగనున్న ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సి.శరవణన్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు సాధారణ పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్‌ మొబైల్‌ నంబర్‌ 9440810105లో సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామరెడ్డి ప్రజలకు సూచించారు. జిల్లాలో ఎన్నికలు ముగిసేంత వరకు సాధారణ పరిశీలకులు ఫోన్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

kcr gadde digali, కేసిఆర్‌ గద్దె దిగాలి

కేసిఆర్‌ గద్దె దిగాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు…16 అంటే ఎలాగోలా తంటాలు పడి నయానో…భయానో 16సీట్లను గెలిపించుకుంటారనీ అనుకున్నామని, కానీ ఇలా ఘోరాతిఘోరంగా 16మంది విద్యార్థులను బలి కొంటారని ఎవరూ ఊహించలేదని, కేసిఆర్‌ చరిత్ర అంతా ఇలా నమ్మించి ప్రాణాలు తీసిన చరిత్రేనని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ), తెలంగాణ కమిటీ (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌)) కిషన్‌ వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే తెలంగాణా సాధనకు ఎంతగానో కషి చేసిన ఎంటెక్‌ విద్యార్థిని తంగెళ్ళ శృతిని వరంగల్‌ జిల్లా మొద్దుగుట్ట వద్ద ఎన్‌కౌంటర్‌ పేరిట చంపివేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని అదిష్టించినందుకు ఇచ్చిన బలి అని ఎద్దేవా చేసింది. ఇప్పుడు కేంద్రంలో అధికారం చేసేందుకు 16మంది విద్యార్థులను బలి తీసుకున్నారని విమర్శించింది. ఇదంతా కేసిఆర్‌ పాలనా దక్షతకే నిదర్శనమని, కనుక ఈ హత్యలన్నింటికీ కెసిఆరే భాద్యత వహించి రాజీనామా చేయాలని అన్నిరంగాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఉపాద్యాయులు, యువతీ, యువకులు, ముఖ్యంగా అనేకంగా నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లి తండ్రులు కోరుతున్నారని తెలిపింది. నల్లగొండలో ఎమ్మెల్యేను నిలదీసినట్లుగా అడుగడునా నిలదీయాలని పేర్కొంది. శృతితోపాటు విద్యాసాగర్‌ను, ఖమ్మంలో 12మంది సీపీబాట సంస్థ సభ్యులను కూడా ఎన్‌కౌంటర్‌ పేరుతో ప్రభుత్వం చంపివేసిందని ఆరోపించింది.

kaleshwaram project wet run vijayavantham, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్‌ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేసేందుకు మొత్తం 82మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిష్టంగా 2.66మెగావాట్ల నుండి మొదలు 26, 40, 106…ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న..బాహుబలిగా పిలిచే 139మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. నందిమేడారం పంపుహౌజ్‌లో 124.4మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్‌ పూర్తి చేసుకొని, వెట్‌ రన్‌ కు సిద్ధంగా ఉన్నాయి.

mera bharat mahan, మేరా భారత్‌ మహాన్‌

మేరా భారత్‌ మహాన్‌

ప్రతాప ప్రొడక్షన్‌ పతాకంపై భారత దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం మేరా భారత్‌ మహాన్‌ ఈనెల 26వ తేదీ శుక్రవారం విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు డాక్టర్‌ శ్రీధర్‌ రాజు, డాక్టర్‌ తాళ్ల రవి, డాక్టర్‌ పల్లవి రెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 థియేటర్లలో శుక్రవారం విడుదల అవుతుందని తెలిపారు. యువత సంకల్పిస్తే దేశం బాగుపడుతుందని, సమాజంలోని సమస్యలను అరికట్టవచ్చని, యువతను చైతన్యపరిచేలా ఈ చిత్రాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎలా ఎదుర్కొవాలని ఈ చిత్రంలో చూపించామని చెప్పారు. ఈ చిత్రం ద్వారా యువతకు మంచి సందేశాన్ని కూడా ఇచ్చామని అన్నారు. ఈ చిత్రానికి ఎర్రంశెట్టి సాయి డైలాగ్స్‌, లలిత్‌ సురేష్‌ మ్యూజిక్‌, పెద్దాడ మూర్తి సాహిత్యాన్ని సమకూర్చగా, ఈ చిత్రంలో అఖిల్‌ కార్తిక్‌, ప్రియాంకశర్మ హిరోహిరోయిన్లుగా నటించారని తెలిపారు. అనంతరం గవర్నర్‌ లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లయన్‌ పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని, అప్పడే సమాజం బాగుంటుందనే సామాజిక స్పృహతోపాటు ప్రేమ, వినోదభరిత అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారన్నారు. లయన్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారని, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందులోని లోటుపాట్లను చూపిస్తూ రెండు కుటుంబాలలో జరిగిన యదార్థగాదను ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. ఈ సమావేశంలో లయన్‌ అప్పరాజు, లయన్‌ అంజిరెడ్డి, లయన్‌ కోదండపాణి, లయన్‌ బి.వెంకటేశ్వర్లు, లయన్‌ మురళీధర్‌, అడ్వకేట్‌, సినీ నటుడు కెఆర్‌.నాగరాజు, డిసిపి లయన్‌ నేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

repu nagaramlo jadugar anand blind fold root, రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’

రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’

ప్రఖ్యాత ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్‌ ఆనంద్‌ బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌ ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభమవుతుందని జాదూగర్‌ ఆనంద్‌ తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పుట్టానని, ఇప్పటి వరకు 33వేల షోలు చేసి పలు అవార్డులను పొందానని తెలిపారు. 1980లో బ్రస్సేలో ఇచ్చిన ప్రదర్శనకు దిగ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అమెరికా, యూరప్‌, ఆసియా, అస్ట్రేలియా, ఆఫ్రికా వంటి 36దేశాలలో 33వేల ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచంలోనే ఉత్తమ జాదూగర్‌గా నిలిచానని అన్నారు. ఇంద్రజాలం రికార్డుల కోసమే కాకుండా మనిషిలో మనోవికాసాన్ని పెంపొందింపజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంద్రజాలాన్ని ఓ విద్యగా గుర్తించి దేశంలో మ్యాజిక్‌ ఆకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సాధించిన తను వరంగల్‌ నగరంలో బ్లైండ్‌ ఫోల్డ్‌ ర్యాలీ నిర్వహిస్తున్నానని తెలిపారు. గురువారం ఉదయం 11గంటలకు అనికా బజాజ్‌ నుండి ప్రారంభమై పోచమ్‌మైదాన్‌, వెంకటరమణ థియేటర్‌ మీదుగా లేబర్‌కాలనీ, 100ఫీజ్‌ రోడ్‌, కాశిబుగ్గ, ములుగురోడ్డు మీదుగా హన్మకొండ, అదాలత్‌, కాజీపేట, ఎన్‌ఐటి నుండి చివరకు అనికా బజాజ్‌ షోరూమ్‌ వరకు ర్యాలీ ముగుస్తుందని తెలిపారు.

vidyardula jivithalatho chelagatamadutunna interboard, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు

విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌బోర్డు చెలగాటమాడుతోందని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మల్యాల వినయ్‌గౌడ్‌ ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాల్యాల వినయ్‌ గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్‌ బోర్డు చెలగాటం అడుతుందని, ఇంటర్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సరైన పద్దతిలో స్పందించడం లేదని విమర్శించారు. తక్కువ మార్కులు వచ్చి అన్యాయం జరిగినా విద్యార్థులకు ఉచితంగా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు, గ్లోబరినా సంస్థ చేసిన తప్పులకు విద్యార్థులను బలిచేయద్దని అన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించాలని కోరారు. 17మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్‌ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వేణు, భూమేష్‌, వెంకటేష్‌, అబ్బాస్‌, సాయి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

repu jobmela, రేపు జాబ్‌మేళా

రేపు జాబ్‌మేళా

కాటారం మండలంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్‌ మేళాను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోగలరని కాటారం పోలీసులు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్‌ హాల్‌ (అంబేద్కర్‌ స్టేడియం సమీపంలో) ఎస్పీ భాస్కరన్‌ అద్వర్యంలో ‘జాబ్‌ మేళా’ నిర్వహించబడునని అన్నారు. ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసిన యువతి, యువకులు బుధవారం సాయంత్రం 5గంటలలోపు పేరు, సెల్‌ నంబర్‌ కాటారం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అసక్తి గల యువతి, యువకులు గురువారం ఉదయం 8గంటలకు కాటారం పోలీస్‌స్టేషన్‌ నుండి బస్‌ల ద్వారా భూపాలపల్లి తీసుకువెళతారని తెలిపారు.

ennikaloo athyadika stanalu geluchela karyakarthalu krushi cheyali, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి

ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి

రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కషి చేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఐనవోలు మండల కేంద్రంలో ఐనవోలు మండల ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆశావాహులతో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసిన గ్రామాలకు సీడిఎఫ్‌ నిధుల నుండి 15లక్షలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వర్థన్నపేట నియోజకవర్గంలోని అన్ని స్థానాలలో గులాబీ జెండా ఎగురవేయాలని, దానికోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో¸ ఎన్నికల ఇన్‌చార్జ్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

carekkannunna mla gandra, కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?

కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?

తెలంగాణ రాష్ట్రంలో ఒకొక్కరుగా హస్తాన్ని వీడి కారెక్కుతుండగా మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కారు ఎక్కుతున్నట్లుగా తెలుస్తుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. గత కొద్దినెలలుగా టిఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉంటున్న ఆయన సతీసమేతంగా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. మొన్నటి వరకు మంత్రిపదవి కావాలని, ఇస్తేనే పార్టీలో చేరుతానని చెప్పడంతో అధిష్టానం కొద్దిగా ఆలోచనలో పడింది. సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి గండ్ర జ్యోతికి ఇస్తామని గులాబీ బాస్‌ హామీ ఇవ్వడంతో గండ్ర దంపతులు కారెక్కేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వారం రోజుల్లో వీరు గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి గండ్ర వెంకటరమణరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరితే ఇక కాంగ్రెస్‌ పార్టీకి మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే.

pariksha kendralanu sandarshinchina cp doctor ravinder, పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

స్టఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లపై పోలీస్‌ కమీషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మద్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఆవరణలోనే తినుబండారాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా పుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత పరీక్షా కేంద్రం ఇంచార్జ్‌లకు పోలీస్‌ కమీషనర్‌ ఆదేశించారు.

mantri dayakarraonu kalasina nyayaporata sangibava commity, మంత్రి దయాకర్‌రావును కలిసిన న్యాయపోరాట సంఘీభావ కమిటీ

మంత్రి దయాకర్‌రావును కలిసిన న్యాయపోరాట సంఘీభావ కమిటీ

సుశృత-దేవర్ష్‌ల సమాధిని స్మారక స్మృతివనం విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మాట్లాడుతానని, పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని న్యాయ పోరాట సంఘీభావ కమిటీ పేర్కొంది. సుశృత-దేవర్ష్‌ న్యాయపోరాట సంఘీభావ కమిటీ శుక్రవారం రాత్రి హన్మకొండలోని మంత్రి దయాకర్‌రావును కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుశృత-దేవర్ష్‌ భార్యబిడ్డలను దారుణంగా చంపిన హంతకుడు మాచర్ల రమేష్‌ ఇంటి ఎదుట సుశృత తల్లి కందిక కోమల సమాధి కట్టిన సమాధికి స్మారక స్మృతివనంగా ప్రకటించాలని మంత్రిని కోరామని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. సుశృత తల్లి కందిక కోమల కుటుంబానికి తన సానుభూతి తెలిపారు. బాధితులకు న్యాయంగా, చట్టపరంగా రావాల్సిన పరిహారాలను అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారని అన్నారు. స్మారక స్మృతివనం కోసం కోమల చేస్తున్న పోరాటానికి ఆటంకాలు కలిగించే వారి నుండి రక్షణ కల్పించాలని పాలకుర్తి సీఐని ఆదేశించారు. హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మాచర్ల రమేష్‌ఖు మద్దతు తెలుపుతున్న టిఆర్‌ఎస్‌ నాయకుడిని పార్టీ నుంచి తొలగించి, అరెస్టు చేయించానని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో న్యాయ పోరాట సంఘీభావ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య, రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం సదానందం, జనగామ జిల్లా నాయకుడు గట్టు సుదర్శన్‌, కెఎన్‌పిఎస్‌ ఉమ్మడి జిల్లాల కన్వీనర్‌ కొమ్ము సురేందర్‌, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ గురిమిల్ల రాజు, ట్రైబల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కన్వీనర్‌ పోరిక ఉదయ్‌సింగ్‌, టిపిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.రమాదేవి, సుశృత మేనమామ గుండె ప్రమోద్‌, టివివి ఉమ్మడి వరంగల్‌ జిల్లా కన్వీనర్‌ జెటబోయిన భరత్‌, పిడిఎం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కో కన్వీనర్‌ తాళ్లపెల్లి సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

pariksha kendralanu sandarshinchina cp doctor ravinder, పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

స్టఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లపై పోలీస్‌ కమీషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మద్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఆవరణలోనే తినుబండారాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా పుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత పరీక్షా కేంద్రం ఇంచార్జ్‌లకు పోలీస్‌ కమీషనర్‌ ఆదేశించారు.

pantalu andipoina rythulanu prabuthvam adukovali, పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పాకాల ఆయకట్టు కింద వరి పంట సాగు చేసుకోగా పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఖానాపురం ఎంపిపి, కాంగ్రెస్‌ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు అన్నారు. పాకాల చెరువు ఆయకట్టు కొత్తూరు గ్రామ శివారులోని తుంగబంధం కాలువ కింద రైతులు రబీలో వరి పంటను సాగు చేసుకున్న పంటలు ఎండిపోగా రవీంద్‌ రావు బందం శుక్రవారం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకుదెరువు కోసం పంటలు సాగు చేస్తే రైతులకు కష్టాలపాలవుతున్నారని తెలిపారు. పాఖాల చివరి ఆయకట్టుకు నీరందించడంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, అధికారులు వైఫల్యం చెందారని, కింది ఆయకట్టులో వందలాది ఎకరాలల్లో పొలాలు పొట్ట దశలో ఎండిపోగా, కొత్తూరు గ్రామ శివారులో ఎండిన పొలాలను పరిశీలించి, తక్షణమే అధికారులతో పంట సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జగన్‌మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు, రైతులు నరసింహ, రాజు, బావుసింగ్‌, అశోక్‌, రాజేందర్‌లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

prajalu korukunna vyakthulake avakasham, ప్రజలు కోరుకున్న వ్యక్తులకే అవకాశం

ప్రజలు కోరుకున్న వ్యక్తులకే అవకాశం

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలు, మండల ప్రజల కోరుకున్న వ్యక్తులకే అధిష్టానం అవకాశం కల్పిస్తుందని జడ్పిటిసి పాలకుర్తి సారంగపాణి అన్నారు. శనివారం ఎన్నికల అభ్యర్ధుల పరిశీలన కోరకు ఆయా గ్రామాల పార్టీ ఇంచార్జీలతో కలిసి స్థానిక ప్రజలు, నాయకులతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్ధుల పరిశీలనలో భాగంగా మండలంలో చెన్నారం, కాశగూడెం, నల్లబెల్లి, ఇల్లంద గ్రామాలలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ప్రజల మధ్య ఉంటూ పార్టీ కొరకు, రాష్ట్రం కొరకు ఉద్యమంలో పాల్గోన్న నాయకులకే అవకాశాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాత్రను ప్రజలు మరువలేరని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మార్గం భిక్షపతి, ఆయా గ్రామాల ఎన్నికల ఇంచార్జులు యండి రహీం, సమ్మేట యాదగిరి, అన్నమనేనీ మోహన్‌రావు, యండి అన్వర్‌లతోపాటు సర్పంచ్‌లు భాస్కర్‌రావు, ముత్యం దేవేంద్రసంపత్‌, సుంకరి సాంబయ్య, పార్టీ నాయకులు ఉన్నారు.

gananga chandrababu janmadina vedukalu, ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 69వ జన్మదిన వేడుకలను పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగెల్లి సురేష్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణ కేంద్రంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిమిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎక్కడ నిర్వహించినా అభివృద్దే ధ్యేయంగా పనిచేయడమే ఆయన లక్ష్యమని అన్నారు. 69ఏళ్ల వయసులో కూడా ప్రజాసేవలో ముందుకు వెళుతున్న ఆయన మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో తెలుగు యువత మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ జూబేర్‌, నాయకులు సేహగల్‌ బాబా, రాజ్‌ కుమార్‌, రాము, తుమ్మల విజయ్‌, జాణ్సణ్‌, బంగారు ప్రశాంత్‌ తదితరులు పాల్గోన్నారు.

105 samvasarala veduka, 105 సవత్సరాల వేడుక

105 సవత్సరాల వేడుక

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్థన్నపేట మండలం కట్రియాల గ్రామంలో ఓ అవ్వ 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల మల్లమ్మకు నాలుగు తరాలకు చెందిన కొడుకులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాల్లు అందరు కలసి శతదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తబట్టలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. మల్లమ్మ కొడుకులు చెవ్వల్ల బొంద్యాలు, సత్తయ్య, చేరాలు, రామక్క, వారి కుటుంబాలు స్వగ్రామమైన కట్రియాలలో శతదిన వేడుకలు చేసుకున్నారు.

nagaramlo kukkalu…bowboiye, నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ !

నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ !

మొరిగే కుక్క కరవదంటారు…కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు…మొరిగే కుక్కలు సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజలను కుక్కలు వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు ద్విచక్రవాహనంపై వెళ్లే వారిని కూడా కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా…బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరుకోవాలన్నా బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. కుక్కల బెడద నివారించండి మహాప్రభో…అని ప్రజలు అనేకసార్లు డివిజన్‌ కార్పొరేటర్లకు, వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు ఆ దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్క కాటుకు ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నా అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు వీరవిహారం చేస్తున్నాయని, రాత్రి సమయాల్లో రోడ్డుపై ఆటో దిగి ఇంటికి వెళ్లే దారిలో ఖచ్చితంగా కుక్కల బారిన పడవలసి వస్తుందని ప్రజలు చెపుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం నగరంలో జరుగుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఇటీవల కుక్కలు చిన్నారులను లక్ష్యంగా చేసుకుని గాయాలపాలు చేస్తున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో కుక్కల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రేటర్‌ అధికారులు కుక్కల బెడదను తీవ్రంగా పరిగణించి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో కరీమాబాద్‌, శివనగర్‌, రామన్నపేట, రంగశాయిపేట్‌, అండర్‌ రైల్వే గేట్‌, గిర్మాజీపేట, కాశిబుగ్గ వివిధ ప్రాంతాలలో ఈ వీధి కుక్కలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. వీధి వీధినా గుంపులు గుంపులుగా దర్శనం ఇవ్వటంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరంగల్‌ నగరంలో వీధికుక్కల విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఏ రోడ్డులో చూసిన కుక్కలు గుంపులుగుంపులుగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు సెలవులు ఇవ్వటం వల్ల ఇంటి ఆవరణలో ఆడుకోవటానికి బయటకు వెళ్లాలంటే వీధికుక్కలను చూసి బయటకు వెళ్లడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇంట్లోనే ఉండి టివి చూస్తూ గడుపుతున్నారని, దీంతో వారు సంతోషంగా వేసవి సెలవులను గడపడం లేదని అన్నారు. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులపై వెళుతున్న వారి వెంటపడి కుక్కలు మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల 21వ డివిజన్‌ కరీమాబాద్‌ గుండుబావులు ప్రాంతంలో ఒక చిన్నారి కుక్క కాటుకు గురి కావటం జరిగింది. నగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని నివారించాలని కార్పొరేటర్లకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మనుషుల మీద పడి కరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాలలో వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. రాత్రివేళల్లో చిన్నపిల్లలకు కుక్కల అరుపులకు నిద్ర పట్టక ఆరుబయట పిల్లలను నిద్రించేందుకు ఉపక్రమిస్తే ఎక్కడ కుక్కలు వచ్చి పీక్కుతింటాయోనని భయంతో నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొందని, అదేవిధంగా అత్యవసర పనులపై బయటకు రావాలంటే భయాందోళనకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని నగరంలో వీధికుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాల్లో వదిలివేయడానికి చర్యలు చేపడుతున్నామని, కుక్కల కొరకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొంత బడ్జెట్‌ విడుదల చేసినా చర్యలకు మాత్రం అధికారులు చొరవ చూపడం లేదని వాపోయారు. మునిసిపల్‌ కమిషనర్‌కి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా లాభం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. అయితే నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికయినా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు స్పందించి కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని నగర ప్రజలు వేడుకుంటున్నారు.

si ratha parikshaku policela advaryamlo help desk, ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్‌’ డెస్క్‌

ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్‌’ డెస్క్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శని, ఆదివారాల్లో జరిగే స్టయిఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్షకు నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎస్సై తుది రాత పరీక్షకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు ముఖ్యమైన కూడళ్లల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలియజేయడంతోపాటు అభ్యర్థులు తెలుసుకునేందుకు వీలుగా ముఖ్యకూడళ్లలో పరీక్షా కేంద్రానికి దారిని తెలుపుతూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో పరీక్ష రాసే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పోలీసులు అందిస్తున్న సహకారానికి తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version