chaduvuthopatu kridallo raninchali, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

– చింతగట్టు గ్రామాభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని చింతగట్టు గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం అన్నారు. 55వ డివిజన్‌ పరిధిలోని చింతగట్టులో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వేసవి క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, దాతగా హాజరై వాలీబాల్‌ క్రీడలు ప్రారంభించారు. తాను పుట్టిన గ్రామంలోని విద్యార్థులకు తన సొంత ఖర్చుతో వాలీబాల్‌ , నెట్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాంనర్సయ్య, పాపయ్య, ఆడెపు సుదర్శన్‌, శ్యామ్‌, బాలవికాస ప్రతినిధులు నద్దునూరి బాబురావు, రాజకొమురయ్య, వాలీబాల్‌ కోచ్‌ రాణప్రతాప్‌, శ్రావణ్‌, చింటూ, విద్యార్థులు పాల్గొన్నారు.

mandava paramarsha, మండవ పరామర్శ

మండవ పరామర్శ

అనారోగ్యంతో కిమ్స్‌ హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘వేడిగాలి’ పత్రిక ఎడిటర్‌ జమాల్పూర్‌ విఠల్‌ వ్యాస్‌ను శనివారం మధ్యాహ్నం టిఆర్‌ఎస్‌ ముఖ్య నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో వాకబు చేశారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని కిమ్స్‌ ఆసపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సాంబశివరావును కోరారు. సకాలంలో వైద్యసేవలు అందచేయడంలో చొరవ చూపిన ఎంపీ కవితను మండవ అభినందించారు. ఈ సందర్భంగా మండవ వ్యాస్‌ కుటుంబసభ్యులు, డాక్టర్‌ రాజశేఖర్‌, నాగోజి, ఈశ్వర్‌, మేఘన, గణేష్‌లకు భరోసా ఇచ్చారు. వ్యాస్‌ కోలుకునే వరకు అవసరమైన వైద్యం కోసం బాసటగా నిలుస్తానని వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. అదేరోజు హైదరాబాద్లో ఇంటిలిజెన్స్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌ కూడా వ్యాస్‌ను పరామర్శించారు. డాక్టర్లని కలిసి వ్యాస్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

nakili vithanalu vikraisthe pd act namodu cheyandi, నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయండి

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయండి

– వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు పీడీయాక్ట్‌ కింద కేసులను నమోదు చేయాల్సిందిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అధికారులను అదేశించారు. రాబోవు వర్షాకాలంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభంకానుండటంతో వ్యవసాయదారుల సంక్షేమాన్ని దష్టిలో వుంచుకోని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ విత్తనాలను నియంత్రించడంపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులతో శుక్రవారం ప్రత్యేక సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ రైతులకు మేలు కలిగించే రీతీలో పోలీస్‌ అధికారులు నకిలీ విత్తనాలతోపాటు, నకిలీ పురుగు మందుల విక్రయాలను పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన భాధ్యత పోలీస్‌ అధికారులపై వుందని అన్నారు. నకిలీ విత్తన అమ్మకాల కొరకు గ్రామాలకు వచ్చే ఏజెంట్లు, దళారీలతోపాటు విత్తనాల విక్రయాల కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చి లాడ్జ్‌ల్లో బసచేసే వ్యక్తుల సమాచారాన్ని స్థానిక పోలీసులు సేకరించాలని తెలిపారు. గతంలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతోపాటు వారిపై గట్టి నిఘా కొనసాగించాల్సి వుంటుందని, ఇందుకోసం స్థానిక పోలీసులతోపాటు, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రత్యేక దష్టి పెట్టాలని అన్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలను గుర్తించడంపై స్థానిక పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడంతోపాటు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుకు సంబంధించిన రశీదు పోందే విధంగా రైతులను ప్రోత్సహించాల్సి వుంటుందని చెప్పారు. ఇదే సమయంలో గడువు తీరిన విత్తనాలను అమ్మకాలపై అధికారులు దష్టిపెట్టాలని, నకిలీ విత్తనాల నియంత్రణకు అధికారులు స్థానిక వ్యవసాయ విభాగం అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రాబోవు 15రోజుల లక్ష్యంగా నకిలీ విత్తనరహిత పోలీస్‌ కమిషనరేట్‌గా గుర్తింపు తీసుకరావడంలో పోలీస్‌ అధికారులు పూర్తిస్థాయిలో కషి చేసి రైతులు నష్టపోకుండా, రైతులకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు.

repu narada jayanthi..,రేపు నారద జయంతి….

రేపు నారద జయంతి….

ఆదర్శ పాత్రికేయుడు నారదుడు…నారద మహర్షి..మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోకసంచారం చేస్తాడు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నారదుని జన్మతిథి వైశాఖ బహుళ విదియ. ఈ తిథినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుతారు. నారదుడు త్రిలోక సంచారి. ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటాడు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్రను పోషిస్తుంటాడు. ‘నార’ అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ‘ద’ అనగా ఇచ్చేవాడని అర్థం ఉంది. నారదుడి జన్మ వత్తాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రళయం తర్వాత కాలంలో పునఃసష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుని నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ…మరీ చి, అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజాపతులను సష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు. మానవాళి శ్రేయస్సు కోసం నారదుడు ఎన్నో మంచి పనులు చేశాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పాత్రికేయలందరికీ మహర్షి నారదుడి జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం. అందుకే ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినంగా నిర్వహిస్తూ..ఆ రోజున పాత్రికేయ వత్తికి న్యాయం చేకూరుస్తున్న కొంతమంది పాత్రికేయులను ప్రతి సంవత్సరం సంచారభారతి సన్మానిస్తున్నది. పాత్రికేయులు అంతా మహర్షి నారదుని బాటలో నడిచి ప్రజల కష్టాలను దూరం చేసినప్పుడే ధర్మమార్గంలో నడిచే సమాజం వెల్లివిరుస్తుంది. ఈ సందర్భంగా 19వ తేదీ ఆదివారం ఉదయం పదిన్నరకు బాలసముద్రంలోని సామాజికం మోహన్‌రెడ్డి స్మారక భవనంలోని ఏసీ సెమినార్‌ హాల్లో నారద జయంతి సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులను సమాచార భారతి సన్మానిస్తున్నది. ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ అధిపతి మల్లేశ్వర్‌, భారతీయ ప్రజ్ఞ సంపాదకులు మామిడి గిరిధర్‌ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు దాసరి కష్ణారెడ్డి, పిన్న శివకుమార్‌లను సత్కరిస్తున్నారు.

ftl bumulu mingestunnaru, ఎఫ్‌టీఎల్‌ భూములు మింగేస్తున్నారు…!

ఎఫ్‌టీఎల్‌ భూములు మింగేస్తున్నారు…!

భద్రకాళి చెరువు శిఖం భూములపై కబ్జాకోరుల కన్ను

ఎఫ్‌టీఎల్‌ భూముల్లో దర్జాగా నిర్మాణాలు

ఎఫ్‌టీఎల్‌ కాదని దవీకరిస్తూ కబ్జాకు సహకరిస్తున్న ఓ ప్రభుత్వ ఇంజనీర్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చుకొని నిర్మాణాలు చేస్తున్న కొందరు వ్యక్తులు

నగరంలో ఓ కొత్త కబ్జాకు కొందరు తెర లేపారు. ఎఫ్‌టీఎల్‌ భూముల్లో పాగా వేసి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. హంటర్‌ రోడ్‌ ప్రాంతంలోని భద్రకాళి చెరువు ఎఫ్‌టీఎల్‌ భూముల్లో దర్జాగా కుడా నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌లు తెచ్చుకొని మరి నిర్మాణాలు చేస్తున్నారు. కుడా అనుమతులు ఇవ్వడానికి కావల్సిన ఎన్‌ఓసి సర్టిఫికేట్‌ను ఓ ప్రభుత్వ ఇంజనీర్‌ డబ్బులు దండుకొని ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎఫ్‌టీఎల్‌ భూముల్లో కబ్జాదారులు దర్జా వెలగబెడుతున్నారు.

‘ఎఫ్‌టీఎల్‌’ భూముల కబ్జాపై సమగ్ర కథనం త్వరలో……

professorpia thappudu pracharalanu vyethirekinchandi, ప్రొఫెసర్‌పై తప్పుడు ప్రచారాలను వ్యతిరేకించండి

ప్రొఫెసర్‌పై తప్పుడు ప్రచారాలను వ్యతిరేకించండి

శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతపై చేస్తున్న తప్పడు ప్రచారాలను వ్యతిరేకించాలని ప్రజాతంత్రవిద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) నాయకులు, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్క్సిస్టు-లెనినిస్టు) యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం వారు మాట్లాడుతూ ప్రొఫెసర్‌ సుజాత దళితులపక్షాన నిలిచి, అడుగడుగున దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ, పీడిత దళిత ప్రజలను చైతన్యవంతం గావిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా దళిత మహిళలకు భరోసాను ఇస్తున్నదని, తమ అధికార పార్టీలకు దాసోహం చేయటంలేదనే అక్కసుతో దేశభవిష్యత్‌ అయిన విశ్వవిద్యాలయం విద్యార్థులపై తమ బ్రాహ్మణీయ, మనువాద భావజాలాన్ని రుద్దడానికి వ్యతిరేఖంగా నిలబడుతూ విద్యార్థుల్లో శాస్త్రియ అవగాహన కల్పిస్తూ, మార్క్స్‌, పూలే, అంబేద్కర్‌ల ఆలోచనలను ప్రచారం కావిస్తూ, భూస్వామ్య అవశేషభమైన అగ్రకుల ఉన్మాదాన్ని, తమ ఉపన్యాసాలతో ఎదిరిస్తూ, ఎదిరించేలా విద్యార్థులను తయారు చేస్తున్నదని అన్నారు. ఎలాగైనా అణిచివేయాలనే దురుద్దేషంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, దాని అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపితో దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. అంతేగాక ఎడ్యుకేషన్‌ టూర్‌లకని తీసుకెళ్ళి విద్యార్థులను మావోయిస్టులతో కలిపిస్తున్నదంటూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక ఫాసిస్టు నిర్బంధపూరిత విధానాలను ఎండగడుతున్నందున తమను వ్యతిరేకించే వారెవ్వురూ ఉండకూడదని మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ దుష్ప్రచారం చేస్తూ అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. ఇటువంటి పాలకవర్గాల (కేంద్ర, రాష్ట ప్రభుత్వాల) కుటిలనీతిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్‌ సుజాతపై దాడులకు పూనుకుంటున్న వారు ఎవరో విద్యార్థులు, వివిధ రంగాల ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు మాని వాస్తవాలపై ఆధారపడి మాట్లాడాలే తప్ప అవాస్తవాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ భావపరంగా దాడులు చేస్తూ మేధావులను, విద్యార్థులను అణిచివేయచూడడాన్ని అన్ని రంగాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) రాష్ట్ర నాయకులు అర్శం అశోక్‌, శరణ్‌, పథ్వి, తిరుపతీ, ఎం.అనిల్‌కుమార్‌, యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం రాష్ట్ర నాయకుడు జి.సదానందం ఉన్నారు.

smashanallo realeastate, స్మశానాల్లో రియలెస్టేట్‌

స్మశానాల్లో రియలెస్టేట్‌

భూకబ్జాలు, ఇండ్ల కబ్జాలు, చెరువులు, కుంటల కబ్జాల గురించి తరచు మనం వింటూనే ఉన్నాం. ఇటీవల ఇవి మరి ఎక్కువైపోయాయి. నూతన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి స్థానికంగా భూములకు రెక్కలు రావడంతో కబ్జారాయుళ్ళ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేసి భూములు లాక్కోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కబ్జాల్లో ఓ కొత్తరకం కబ్జాకు తెర తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే…వర్థన్నపేట నియోజకవర్గంలో ఉన్న ఐనవోలు నూతన మండలంగా ఏర్పడిన తర్వాత కొందరు రియాల్టర్లు మండలకేంద్రానికి ముందుభాగంలో కొంతభూమిని కొనుగోలు చేసి ప్లాట్లను చేసి అమ్మకానికి ఉంచారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే వారు కోనుగోలు చేసిన భూమికి ముందు, పక్కన గ్రామానికి సంబంధించిన స్మశానవాటికలు ఉన్నాయి. దీంతో ఇండ్లస్థలాల కొరకు ఏర్పాటు చేసిన వెంచర్‌లో స్మశనాలు ఉంటే ఎవరు కోనుగోలు చేయడానికి ముందుకు రారనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ నేతల అండదండలతో కలిసి గ్రామ ప్రజలకు సంబంధించిన స్మశానవాటికను అభివృద్ధి పేరుతో ఎత్తివేసేందుకు కొంతమంది పథకం రచించారు. తరతరాలుగా స్మశానవాటిక కోసం ప్రజలు వినియోగించుకుంటున్న స్థలాన్ని మార్చేందుకు రియాల్టర్లు విఫలయత్నం చేస్తున్నారు.

రియల్టర్‌ వ్యాపారం కోసం…

భూముల వ్యాపారం చేసుకుంటే దానికి ఎవరు అడ్డు చెప్పరు. అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని లేఅవుట్లు నిర్వహించుకోవచ్చు. కాని అనువు గాని చోటని తెలిసి కూడా అక్రమంగా స్థలాన్ని కొనుగోలు చేసి, ప్లాట్లు చేసి అమ్ముకొని కోట్లు గడించడానికి రియల్టర్లు చేస్తున్న ప్రయత్నంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అప్పన్నంగా సంపాదించేందుకు రియల్టర్లకు సహకరిస్తున్న కొంతమంది నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు.

అధికారపార్టీ నేత,కార్పోరేటర్‌ భర్త నయాదందా

ఇటీవలే అధికార పార్టీ నుండి కీలక నాయకుడిగా ఎదిగి స్థానిక శాసనసభ్యునికి అత్యంత నమ్మిన బంటుగా ఉంటున్న ఓ కార్పోరేటర్‌ భర్తకి సంబంధించిన ఈ లేఅవుట్‌ కోరకు స్థానిక నాయకులు స్మశానవాటికలను అప్పగించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. కార్పొరేటర్‌ భర్త, ఓ అధికార పార్టీ నాయకుడి చేష్టలతో జనం అసహించుకుంటున్నారు. అధికారం ఉంది కదా అని ప్రజలకు సంబంధించిన స్మశాన స్థలాలను కబ్జా చేసి లేఅవుట్లు వేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండలకేంద్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ఇంత జరుగుతున్నా స్థానిక నాయకులుగానీ, ఎమ్మెల్యేగానీ ఈ విషయంపై ఎంతమాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావీస్తోంది. కార్పొరేటర్‌ భర్త మరో అధికార పార్టీ నాయకుడిని కలుపుకుని స్మశనాల్లోనే లేఅవుట్లు చేసి ఇంత బహిరంగంగా ప్లాట్లను అమ్మకానికి పెట్టినా ఇటు అధికారులుగానీ, అటు అధికార పార్టీ నాయకులుగానీ ఎంత మాత్రం నోరుమెదపకపోవడంపై దీని వెనకాల వీరి హస్తం కూడా ఉంటుందని పలువురు అంటున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని తమకున్న కబ్జా తెలివితో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తరతరాలుగా ఉంటున్న స్మశాన స్థలాన్ని కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు రాక ముందు తప్పుడు ప్రకటనలు…

మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు కుడా నుండి ఇంకా ఎలాంటి అనుమతి రాకముందే కోనుగొలుదారులు ఆకర్షించి ప్లాట్లను అమ్ముకోవాలని నిర్వహకులు చేస్తున్న తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. లేఅవుట్‌ ముందు వెంచర్‌ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు, పోలీస్‌స్టేషన్‌లు నిర్మించబోతున్నట్లు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు బాగోతం చాటున వారికి స్థానిక పాలకులు,ముఖ్య నాయకుల అండదండల ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. ఇకనైనా అధికారులు, అధికార పార్టీ నాయకులు స్పందించి స్మశానాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

bujalu thadumukovadamenduku, భుజాలు తడుముకోవడమేందుకు…

భుజాలు తడుముకోవడమేందుకు…
– దుమారం రేపుతున్న ‘నేటిధాత్రి’ కథనాలు
– నాపైనే అంటూ…ఉక్కిరిబిక్కిరి
– ‘నేటిధాత్రి’పై అక్కసు వెళ్లగక్కుతున్న కొందరు సిబ్బంది
– ‘అస్త్రం’ ఎవరిదీ అంటూ ఆరా…
– విచారణకు ఆదేశించనున్న ఇంటర్‌ బోర్డు…?
– అవినీతి లీలలపై రోడ్డెక్కనున్న విద్యార్థి, ప్రజాసంఘాలు
గత రెండురోజులుగా ‘నేటిధాత్రి’ దినపత్రికలో ‘డిఐఈఓ కార్యాలయంలో…అవినీతి లీలలు’, ‘కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి’ అనే శీర్షికలతో వెలువడిన వరుస కథనాలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ‘గుమ్మడికాయ దొంగ ఎవరని అంటే…భుజాలు తడుముకున్న’ చందంగా కొందరు సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతటితో ఆగకుండా ‘నేటిధాత్రి’ కథనాలపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారని సమాచారం.
                                                                                     వివరాలు త్వరలో…

vidudala cheyali, విడుదల చేయాలి

విడుదల చేయాలి

పౌరహక్కుల సంఘం, టివివి విద్యార్థి నాయకులను బేషరతుగా విడుదల చేయాలని యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం నాయకులు, డిఎస్‌ఓ రాష్ట్ర నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి రాక ముందు అనేక వాగ్దానాలు చేసారని, వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 49 వేలకుపైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మిస్తామని, కోటిఎకరాలకు నీటిని అందిస్తామని వాగ్దానం చేశారని తెలిపారు. గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మించకపోగా భారీ ఖర్చుతో కూడిన భారీ ప్రాజెక్టులకు పూనుకున్నారన్నారు. అందులో భాగమే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారని, దానివలన అనేకమంది రైతులు, కూలీలు, పేద ప్రజలు నిర్వాసితులవుతున్నారని విమర్శించారు. నిర్వాసితులవుతున్న రైతులు, కూలీలు, పేదప్రజలు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా వారిని కలిసి పోరాటానికి సంఘీభావం తెలిపివస్తున్న పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మన్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సంయుక్త కార్యదర్శి రఘునాథ్‌, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు భూపతి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌తో సహా 10మందిని తోగుట్టస్టేషన్‌ వద్ద అక్రమంగా పోలీసులు నిర్బంధించారని అన్నారు. అలాగే ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావులను దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన హక్కుల కార్యకర్తలను, ఆదివాసీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని, బీమా కోరేగావ్‌ కేసును రద్దు చేయాలని క్రూరమైన నిర్బంధపూరిత ‘ఉపా’ చట్టాన్ని వెంటనే ఎత్తిచేయాలని చెప్పారు. వరంగల్‌లో రాజ్య నిర్బంధ వ్యతిరేక యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తున్న టివివి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా అరెస్టు చేసిన పౌరహక్కుల సంఘం నేతలను, వరంగల్‌లో టివివి విద్యార్థి నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం రాష్ట్ర నాయకుడు జి.సదానందం, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) రాష్ట్ర నాయకుడు అర్షం అశోక్‌, ఎం.అనిల్‌కుమార్‌ ఉన్నారు.

vidyarthi jivithamtho urbane college chelagatam, విద్యార్థి జీవితంతో అర్బెన్‌ కాలేజీ చెలగాటం

విద్యార్థి జీవితంతో అర్బెన్‌ కాలేజీ చెలగాటం

నగరంలో ప్రైవేట్‌ కాలేజీలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా కాలేజీలు నడుపుతూ ధనార్జనే ధ్యేయంగా విద్యావ్యాపారం చేస్తున్నారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపి కోట్లు దండుకుంటున్నారు. ఇంటర్‌బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. హన్మకొండ నగరంలో సర్య్కూట్‌ గెస్ట్‌హౌజ్‌ రోడ్డులో ఉన్న అర్బెన్‌ జూనియర్‌ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఓ విద్యార్థి జీవితం ఆగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే…హన్మకొండ కెఎల్‌ఎన్‌రెడ్డి ప్రాంతానికి చెందిన బి.వరుణ్‌ 2017లో ఎంపీసీ గ్రూపులో అడ్మిషన్‌ పొందాడు. 2017-18 మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు కూడా రాయడం జరిగింది. రెండవ సంవత్సరంలో విద్యార్థి కళాశాల ఫీజు చెల్లించలేదనే కారణంతో ఇంటర్‌బోర్డులో 2018-19 రెండవ సంవత్సర వార్షిక పరీక్ష ఫీజును కాలేజీ యాజమాన్యం చెల్లించలేదు. దీని ఫలితంగా విద్యార్థికి ఇంటర్‌ బోర్డు నుండి హాల్‌టికెట్‌ రాకపోవడంతో పరీక్షలు రాయలేకపోయాడు. దీనికంతటికి కారణం కళాశాల యాజమాన్యం ఫీజుల మీదు ఉన్న మోజు విద్యార్థి జీవితంపై లేకపోవడమేనని విద్యార్థి వరుణ్‌ ఆరోపిస్తున్నాడు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం విద్యార్థి కళాశాల ఫీజు చెల్లించినా…చెల్లించకపోయినా పరీక్ష ఫీజును కళాశాలే విద్యార్థి పేరున కట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను వారు ఉల్లంఘించి విద్యార్థి జీవితాన్ని నాశనం చేశారు. ఫీజు పేరుతో తన తల్లిని కాలేజీకి పిలిపించి అనేకసార్లు మానసికంగా మాటలతో హింసించేవారని విద్యార్థి వాపోయాడు. గత కొన్ని రోజుల క్రితం ఫీజు విషయంపై మీతో మాట్లాడేది ఉందంటూ మమ్మల్ని పిలిపించి దొంగను నిల్చోబెట్టిన విధంగా నిల్చోబెట్టి 10మందికిపైగా అధ్యాపకులు గుమిగూడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోపోమ్మని బెదిరించారని బాధితుడు తెలిపాడు.

ప్రిన్సిపాళ్ల మార్పుతో విద్యార్థుల ఇక్కట్లు

అర్బెన్‌ జూనియర్‌ కాలేజీని వరుసగా ప్రిన్సిపాళ్ల మార్పుతో కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రామకృష్ణ కళాశాల నుంచి వెళ్లిన అనంతరం మరో ప్రిన్సిపాల్‌గా అపర్ణ వచ్చారని, ఆమె తరువాత ప్రస్తుతం శైలజా ప్రిన్సిపాల్‌గా కొనసాగుతోంది. ప్రిన్సిపాళ్లు ఈ విధంగా ఒకరి తరువాత ఒకరు మారడం వలన విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలో ఒప్పందం చేసుకున్న ఫీజు కంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపాళ్లు ఆ ఫీజుతో మాకు సంబంధం లేదంటూ కళాశాల మొత్తం ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిఐఈఓకు ఫిర్యాదు

ఇంటర్మీడియట్‌ బోర్డు వరంగల్‌ అర్బన్‌ జిల్లా పర్యవేక్షణాధికారికి విద్యార్థి బి.వరుణ్‌ తనకు జరిగిన అన్యాయంపై అర్బెన్‌ జూనియర్‌ కళాశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశానని, అయినా ఎలాంటి ఫలితం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పై విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కళాశాలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విద్యార్థి వరుణ్‌ వేడుకుంటున్నాడు.

నాకు న్యాయం చేయాలి

కళాశాల ఫీజు చెల్లించలేదనే కారణంగా నా పరీక్ష ఫీజును కళాశాల ప్రిన్సిపాల్‌ చెల్లించకపోవడంతో నాకు హాల్‌టికెట్‌ రాలేదు. దీని వల్ల పరీక్షలు రాసే అర్హతను కోల్పోయాను. విద్యాహక్కుచట్టం ప్రకారం, ఇంటర్‌బోర్డు నిబంధనల ప్రకారం కళాశాల ఫీజు చెల్లించినా…చెల్లించకపోయినా పరీక్ష ఫీజు కట్టలన్నా నిబంధనలను పాటించకుండా సంవత్సర కాలం వృథా చేశారని, దీనికి అర్బెన్‌ కళాశాలే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నాకు జరిగిన అన్యాయంపై ఇంటర్‌బోర్డు డిఐఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని బాధితుడు రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రిన్సిపాల్‌ శైలజా వివరణ

ప్రిన్సిపాల్‌ శైలజాను వివరణ కోరగా నాకు ఆ విషయం గురించి తెలియదు. నేను ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకుని నెలరోజులే అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారం కోసం మాజీ ప్రిన్సిపాల్‌ కృపాకర్‌ను 8328315859 మొబైల్‌ నెంబర్‌లో సంప్రదించాలని సలహా ఇచ్చింది. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా అతను అవుట్‌ ఆఫ్‌ స్టేషన్‌, కులుమనాలిలో ఉన్నాను…ఇప్పుడేం మాట్లాడలేను అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

warangal prajanikaniki abinandanalu, వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు

వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు
సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌
మూడు విడతలలో జరిగిన పరిషత్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రజలకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అభినందనలు తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాల్లో మూడు విడతల్లో మొత్తం 36 మండలాల్లోని 36 జడ్పీటిసీ ఎన్నికలతోపాటు, 413ఎంపిటిసిలకు మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌ పూర్తిగా ప్రశాంతవంతమైన వాతావరణంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పోలింగ్‌ నిర్వహించిన అన్ని గ్రామాల్లోను ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సజావు నిర్వహించేందుకు నాలుగు అంచెల భద్రతతో పోలీసు అధికారులు విధులు నిర్వహించడంతోపాటు, హోంగార్డ్‌ స్థాయి పోలీస్‌ అధికారి నుండి డిసిపి స్థాయి అధికారి వరకు అందరు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. ముఖ్యంగా మంగళవారం నిర్వహించిన పోలింగ్‌ను సజావు నిర్వహించేందుకు ప్రతి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.
పోలింగ్‌ కేంద్ర సందర్శన
మూడవ విడత పరిషత్‌ ఎన్నికల సందర్బంగా గీసుగోండ మండలంలోని పోలింగ్‌ కేంద్రాన్ని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సందర్శించి పోలింగ్‌ కేంద్రంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పోలింగ్‌ సజావుగా కొనసాగేందుకు పోలీసు అధికారులు తీసుకున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ ఈస్ట్‌జోన్‌ డిసిపి నాగరాజు, మామూనూర్‌ ఏసిపి శ్యాంసుందర్‌, గీసుగోండ ఇన్‌స్పెక్టర్‌ సంజీవరావుతో కలసి పరిశీలించారు.

strong roomlanu parishilinchina sp, స్ట్రాంగ్‌ రూములను పరిశీలించిన ఎస్పీ

స్ట్రాంగ్‌ రూములను పరిశీలించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో గల మొదటి, రెండవ విడత బ్యాలెట్‌ బాక్సులను బద్దెనపల్లి మోడల్‌ స్కూల్‌లోని స్ట్రాంగ్‌ రూములను జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గార్డు సిబ్బంది, సీసీ కెమెరాలు ఏర్పాటు, చుట్టూ ఏర్పాటుచేసిన లైటింగ్‌ తదితర భద్రతా ఏర్పాట్లను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని భద్రతా సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ వెంకటరమణ, సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌, తంగళ్లపల్లి ఎస్సై శేఖర్‌ ఉన్నారు.

pranam thisina buthagada, ప్రాణం తీసిన భూతగాదా

ప్రాణం తీసిన భూతగాదా

మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలంలోని బలరావుపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం బలరావుపేట గ్రామంలో భూతగాదాలతో పెట్టం శంకరయ్య అనే వ్యక్తిని అల్లంల బాలయ్య అనే వ్యక్తి గొడ్డలితో నరికాడు. దీంతో పెట్టం శంకరయ్యకు తీవ్రరక్తస్రావం జరిగి అక్కడికక్కడే మతిచెందాడు.

raithilanu sadvinyogam chesukovali, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

– ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక రకాల రాయితీలను కల్పిస్తుందని, రైతులు ప్రభుత్వం కల్పించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్‌ రావు ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీలుగ విత్తనాలను ప్రభుత్వం 65శాతం రాయితీ ఇస్తుందని, కిలో జీలుగ విత్తనాలను 18రూపాయలకే అందజేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. 51రూపాయలు ఉన్న కిలో జీలుగ విత్తనాలకు ప్రభుత్వమే 33రూపాయలు చెల్లిస్తోందన్నారు. విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌ ప్రతులను ఆగ్రోస్‌ సంస్థలో ఇచ్చి విత్తనాలను సబ్సిడీ ధ్వారా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి అడుప కవిత, సర్పంచ్‌లు జన్ను కుమారస్వామి, ఆడెపు దయాకర్‌, ఎంపీటీసీ పెండ్లి కావ్య తిరుపతి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ మజ్జిగ జయపాల్‌, ఉపసర్పంచ్‌లు అడ్డగూడి సతీష్‌, కొట్టం రాజు, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మునిగాల సంపత్‌, సీనియర్‌ నేతలు తండా వెంకన్న, బొల్లపల్లి పరమేశ్వర్‌, పెండ్లి మల్లారెడ్డి, పెండ్లి ఆగారెడ్డి, అమరవాది రవికుమార్‌, డబ్బా శ్రీనివాస్‌, గూడ లింగారెడ్డి, బుర్ర సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

kasulapia preethi…ideam rithi, కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి…

కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి…
వరంగల్‌ అర్బన్‌ ఇంటర్మీడియట్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో అవినీతి ఛాయలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఇక్కడా…అక్కడా అనే తేడా లేకుండా అందినకాడికల్లా దోచుకోవడమే తమ ద్యేయమన్నట్లుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రతి యేటా కాలేజీలు అనుమతులు తీసుకోవడం, రెన్యువల్స్‌ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కాలేజీ అఫ్లియేషన్లు చేయాలన్నా, రెన్యువల్‌ కావాలన్నా కళాశాలల యజమాన్యాలు వీరి చేయి తడిపితేనే పనులు చకాచకా జరుగుతాయని లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ఛందంగా ఆయా ఫైళ్లు మూలనపడుతాయని పలు కాలేజిల యాజమన్యాలు ఆరోపిస్తున్నాయి.
ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకుంటున్న వైనం
కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అవినీతి ఆటలకు కార్యాలయంలోని ఓ అధికారి అండదండలు అందిస్తుండటం మూలంగానే ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. ఒక్కో కాలేజి నుండి వేలకువేలు వసూలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ఇంటర్మీడియట్‌ బోర్డు హైదరాబాద్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమంగా దండుకున్న డబ్బులను ఫిఫ్టీ-ఫిఫ్టీ పంచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. క్యాంపు పేరిట లక్షల రూపాయలు దుర్వినియోగమయినట్లు కార్యాలయంలో పెద్దఎత్తున ప్రచారం కొనసాగుతున్నది. క్యాంపు కార్యాలయంలో పనిచేయని వారి అకౌంట్లల్లో డబ్బులు జమ చేసినట్లు కార్యాలయ సిబ్బందితోపాటు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
                                                                    – ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి వంతపాడుతున్న ఓ అధికారి….
                                                                              వివరాలు రేపటి సంచికలో

congress mptc abyarthi atmahatyayatnam, కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ఓడిపోతానన్న భయంతో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి, పురుగుల మందు తాగారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో జరిగింది. కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాచర్ల రాములు అప్పులపాలయ్యారు. దీనికి తోడు గెలిచే అవకాశం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు, నిద్రమాత్రలు మింగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాములును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాములు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. తన భర్త రాములు ఏడేళ్లు టీఆర్‌ఎస్‌లో పనిచేసినా ఆ పార్టీ మోసం చేసిందని దుర్గ ఆరోపించారు. ఎంపీటీసీ అభ్యర్థిగా ఇంటిపెండెంట్‌గా బరిలోకి దిగిన తన భర్తకు కాంగ్రెస్‌ బి-ఫారమ్‌ ఇచ్చిందని అన్నారు. పలువురు సూటీపోటీ మాటలకు తోడు అప్పులపాలయ్యామన్న బాధతో పురుగులమందు తాగాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

bavi thavakam prarambham, బావి తవ్వకం ప్రారంభం

బావి తవ్వకం ప్రారంభం

వేసవికాలంలో గ్రామపంచాయితీ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని తవ్వడానికి పనులు ప్రారంభించామని గ్రామ సర్పంచ్‌ గోడిశాల మమత సదానందంగౌడ్‌ తెలిపారు. మంగళవారం నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని గ్రామసర్పంచ్‌ చేతుల మీదుగా బావి తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించామని చెప్పారు. గ్రామంలోని ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆముదాల రమేష్‌, కొప్పు రాందాస్‌, గోడిశాల శ్రీనివాస్‌, గ్రామ నాయకులు మాటూరి రవీంద్రాచారి, ఏడ రమేష్‌, ఆవారి కన్నయ్య, మార్థ నవీన్‌, వేముల వేణు, బొడుసు స్వామి, నామాల రామయ్య, మచ్చిక రాజులతోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

mruthula kutumbalaku bima sahayam, మతుల కుటుంబాలకు భీమా సహాయం

మతుల కుటుంబాలకు భీమా సహాయం

నర్సంపేట మండలం కమ్మపల్లి మండలంలోని నేతాజీ పురుషుల పొదుపు సంఘంలో సభ్యులుగా ఉంటూ ఇటీవల మతిచెందిన దామెర స్వామి, గడ్డం అశోక్‌ల నామినీలు (కుటుంబసభ్యులకు) అభయ నిధి పథకం, సామూహిక నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి 55వేల రూపాయల చొప్పున ఆ సంఘ అధ్యక్షుడు సాంబరాతి రమేష్‌ ఆధ్వర్యంలో, దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు నీలా రవీందర్‌ చేతుల మీదుగా బీమా పథకాల డబ్బులను వారికి మంగళవారం సంఘ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు పెండ్యాల మల్లేశం, రాము, రాజు, లింగారెడ్డి, రవి, శ్రీనివాస్‌రెడ్డి, సాంబయ్యలతోపాటు సంఘ గణకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

vidyardulaku andaga youth for swach duggondi, విద్యార్థులకు అండగా యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి

విద్యార్థులకు అండగా యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటికీ అండగా ఉంటామని యూత్‌ ఫర్‌ స్వచ్చదుగ్గొండి అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి శానబోయిన రాజ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం పట్ల దుగ్గొండి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్‌తోపాటు వివిధ రకాలుగా సహాయం అందించిన సందర్భంగా వాటిని ఉపయోగించుకుని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ కోసం ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన కోరారు. యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి ఎప్పటికి అందుబాటులో ఉంటుందని, త్వరలో ప్రభుత్వం నిర్వహించే బడిబాట కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన అధ్యాపక బందాలకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు బాలకష్ణ, మోడెం విద్యాసాగర్‌గౌడ్‌, శివ, ప్రతాప్‌, రమేష్‌, కిషోర్‌, రాజేందర్‌, వేణు, యాదగిరి సుధాకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

taskforce headconistable mruthi, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అలియాస్‌ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోగా హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తరలించారు. మ్యాక్స్‌కేర్‌ వైద్యుల సలహా మేరకు కరాటే శ్రీనును మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో కరాటే శ్రీనుకు చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కరాటే శ్రీను గతంలో హసన్‌పర్తి, హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లలో సైతం విధులు నిర్వహించారు. వీరు 1992బ్యాచ్‌కు చెందినవారు. వీరి తోటి బ్యాచ్‌ మెంట్స్‌, తోటి సిబ్బంది వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version