intintiki nalla connection, ఇంటింటికి నల్లా కనెక్షన్‌

ఇంటింటికి నల్లా కనెక్షన్‌

హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇప్పిస్తామని క్యూసి ఎఇ రాములు తెలిపారు. శుక్రవారం మండలంలోని జయగిరి గ్రామంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను ఎఇ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబం నల్లా కనెక్షన్‌ తీసుకోవాలన్నారు. అక్రమాలు జరగకుండా ఉండాలని పైపులు వేసిన పనితీరును అడిగి తెలుసుకున్నారు. నల్లాకు బిగించిన ఆన్‌, ఆప్‌లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఈ ఇ.సునీత, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ ఇ.అంజు, గ్రామ సర్పంచ్‌ బొల్లవేని రాణి, రాజు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బుర్ర శ్రీధర్‌, వార్డుసభ్యుడు యాటకాల సదానందం తదితరులు పాల్గొన్నారు.

thehsildarlaku gubulu pattukundi, తహశీల్దార్లకు గుబులు పట్టుకుంది

తహశీల్దార్లకు గుబులు పట్టుకుంది

ఓవైపు రెవెన్యూశాఖలో ప్రక్షాళన దిశగా సీఎం కేసిఆర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరోపక్క రెవెన్యూ బాధితులంతా తమ గోడును సర్కార్‌కు వెళ్లబోసుకుంటున్నారు. మునుపెన్నడు లేనివిధంగా రెవెన్యూశాఖలో ఉద్యోగుల మూలంగా జరిగిన తప్పిదాలన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాలుగు అడుగుల భూమి ఉన్న అది మనదే అనిపించుకోవడం కోసం అటు కబ్జాదారులను ఇటు రెవెన్యూ అధికారులను ఎలా ఎదుర్కొవాలో తెలియక మెజార్టీ జనాలు సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భూకబ్జా ఆరోపణలు వచ్చిన, కబ్జాల్లో తలదూర్చి బాధితులకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. హన్మకొండలోని గోపాల్‌పూర్‌ భూసమస్యే ఇందుకు తాజా ఉదాహరణ. భూమిని కబ్జా చేసి, నకిలి దస్తావేజులు సృష్టించి కాజేయాలని చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అంతేకాదు ఇందుకు తన రెవెన్యూ తెలివితో సహకరించి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన తహశీల్దార్‌ నాగయ్యను సైతం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తహశీల్దార్లలో గుబులు

రిటైర్డ్‌ తహశీల్దార్‌ నాగయ్య అరెస్ట్‌తో రిటైర్డ్‌ తహశీల్దార్లలో, ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో గుబులు పట్టుకుందట. సర్వీసులో కొనసాగుతున్న సమయంలో మాజీ తహశీల్దార్‌ నాగయ్య రెవెన్యూశాఖలో అన్ని తానై వ్యవహరించారు. హన్మకొండ తహశీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన అడిగిన వారికల్లా భూమిని పంచిపెట్టాడని అప్పట్లో ప్రచారం జరిగింది. నాగయ్య కొంతమందికి కేటాయించిన భూములను అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ జోక్యం చేసుకుని మరీ వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. అయితే రెవెన్యూ అధికారుల విషయంలో, వారు అనుసరిస్తున్న తీరుపై సర్కార్‌ డేగకన్ను వేయడంతో తహశీల్దార్లకు భయం పట్టుకుందట. గతంలో చేసిన తప్పిదాలను సైతం వెలికితీస్తు ఆరోపణలు వస్తే విచారణ జరిపి నిజమని తేలితే మాజీ ఉద్యోగులను సైతం అరెస్ట్‌ చేస్తుండడంతో కొంతమంది మాజీ తహశీల్దార్లు తాము ఎక్కడైన తప్పు చేశామా…? అని సమీక్షించుకునే పరిస్థితి ఏర్పడిందట. రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యలు అధికంగానే ఉండగా వీటి పరిష్కారంలో తహశీల్దార్లదే కీలకపాత్ర. అయితే వీరు భూహక్కుదారులతో వ్యవహరిస్తున్న తీరు, వారు పరిష్కారం చేస్తున్న విధానంపై ఇంటలీజెన్స్‌ వర్గాలు సైతం ఓ కన్నువేసి ఉంచాయట. భూమిసమస్యల పరిష్కారం కోసం భూయజమానుల వద్ద నుంచి డబ్బులు ఆశించడం. అసలు హక్కుదారులను కాదని అన్యాయంగా భూమిని ఆక్రమించుకున్న వారికి తహశీల్దార్లు ఎవరైన సహయం చేసినట్లు తెలిసినా, కావల్సింది తీసుకుని డాక్యుమెంట్లు సృష్టించి ఇచ్చిన కఠినచర్యలు తీసుకోవడానికి పోలీస్‌శాఖ ఎంతమాత్రం వెనుకాడకపోవడంతో తహశీల్దార్లు భూసమస్యల పరిష్కారం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సర్కార్‌ రెవెన్యూశాఖ విషయంలో సీరియస్‌గా ఉండడంతో తహశీల్దార్లలో గుబులు పట్టుకుంది.

manasthapamtho yuvakudu athmahatya, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సమ్మెట ప్రవీణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. వారంరోజుల క్రితం వెలువడిన కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలలో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందినట్లు తెలిసింది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిన సమ్మెట ప్రవీణ్‌ వర్ధన్నపేట శివారు గంగాదేవి మాటు వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

maji thehsildar nagaiah arrest, మాజీ తహశీల్దార్‌ నాగయ్య అరెస్ట్‌

మాజీ తహశీల్దార్‌ నాగయ్య అరెస్ట్‌

గుండెపోటుతో ఎంజిఎంలో చేరిక

గోపాల్‌పూర్‌ భూవివాదం కేసులో ఒక్కొక్కరిగా జైలు బాటపడుతున్నారు. ఈ భూమి కబ్జా విషయంలో ఇటీవలే వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాజీ పీఎ అశోక్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపగా గురువారం రాత్రి మాజీ తహశీల్దార్‌ నాగయ్య, ఆర్‌ఐ ప్రణయ్‌, విఆర్‌ఎ రాజు, శ్యాంసుందర్‌ను అరెస్టు చేసినట్లు హన్మకొండ ఏసీపీ శ్రీధర్‌ తెలిపారు. గోపాల్‌పూర్‌ భూమికి సంబంధించి 2018 సెప్టెంబర్‌లో వీరు నకిలీ ధ్రువపత్రాలు తయారుచేసినట్లు తెలసింది. 2010లో ఆర్‌ ప్రణయ్‌ అప్పటి విఆర్‌ఎ రాజు (ప్రస్తుతం కాజీపేట విఆర్వో) రిటైర్డు తహశీల్దార్‌ నాగయ్యలు తాజాగా నకిలీ దస్తావేజులు సృష్టించడంతోపాటు పాత తేదీలతో సంతకాలు చేసినట్లు సమాచారం. వీరిలో శ్యాంప్రసాద్‌ అనే వ్యక్తి పాత బాండ్‌పేపర్‌ విక్రయించాడు. దీంతో వీరిపై కేయూ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక

భూకబ్జా విషయంలో అరెస్టు అయిన రిటైర్డు తహశీల్దార్‌ నాగయ్య గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. తక్షణమే స్పందించిన జైలు అధికారులు ఆయనను ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు చికిత్సను అందించారు. అరెస్టు మూలంగా ఒత్తిడికి గురైన రిటైర్డు తహశీల్దార్‌ నాగయ్యకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది.

aa udyogulu bari thegincharu, ఆ ఉద్యోగులు బరి తెగించారు

ఆ ఉద్యోగులు బరి తెగించారు

దొంగే దొంగ…దొంగ…అని అరిచినట్లు ఉంది డిఐఈఓ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగుల తీరు. అవుట్‌సోర్సింగ్‌, మరికొంతమంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఈ కార్యాలయంలో అనుసరిస్తున్న తీరు, ఇక్కడ కొనసాగుతున్న అవినీతిపై ‘నేటిధాత్రి’ వరుస కథనాలను ప్రచురించింది. అయితే ఈ కథనాలను సమాధానం చెప్పలేక నిఖార్సయిన వార్తలతో ఖంగుతిన్న కొంతమంది ఉద్యోగులు తమకు తెలిసిన వారితో, వారి అవినీతికి కొమ్ముకాసే వారితో ఫోన్‌కాల్స్‌, పైరవీలు చేస్తున్నారు. అయినా ‘నేటిధాత్రి’ డిఐఈఓ కార్యాలయంలో అవినీతిని అంతమొందించే దిశగానే కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. దీంతో మింగుడుపడని డిఐఈఓ, అతని వద్ద పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఓ పనికి మాలిన ప్రచారానికి తెరతీశారు. గత 18సంవత్సరాలుగా నిఖార్సయిన వార్తలతో సామాన్యుడి తరపున వకాల్తా పుచ్చుకుని అక్షరసమరం చేస్తున్న ‘నేటిధాత్రి’పై నోటికి వచ్చినట్లు మాట్లాడడం, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అనడం మరీ హీనస్థితికి దిగజారిపోయి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని వారు చేస్తున్న నీతిమాలిన పనిని ‘నేటిధాత్రి’ ప్రతినిధికి అంటగట్టే ప్రయత్నం చేశారు. ఇష్టారీతిన అవినీతికి కార్యాలయంలోనే ఆజ్యం పోస్తూ, అధికారి అనే పదానికి తలవంపులు తేస్తూ దిగజారిపోయిన మాటలతో భయపెట్టాలనే ప్రయత్నం చేస్తే ‘నేటిధాత్రి’ ఎంతకు భయపడదని ఆ ఉద్యోగులు, అధికారికి మేం స్పష్టం చేయదలుచుకున్నాం. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కమీషన్‌ వేసి విచారణ జరిపి నిజనిజాలని వెలికితీయాలని కోరుతున్నాం. ఇప్పటికే వీరి అవినీతి బాగోతంపై ‘నేటిధాత్రి’ ప్రతినిధి ఆర్జేడికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు ఈమెయిల్‌ ద్వారా కథనాలను పోస్టు చేయడం జరిగింది. ఎక్కడ తలొగ్గకుండా ‘నేటిధాత్రి’ అవినీతిపై అక్షర సమరం చేస్తుంటే కొంతమంది పనికిమాలిన తెలివి లేని వారి సూచనలతో ‘నేటిదాత్రి’పై ఆరోపణలు చేయడాన్ని పత్రిక తీవ్రంగా ఖండిస్తుంది. సూర్యుడిపై ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసుకోవాలని కోరుతున్నాం.

అవినీతి చేయనివారికి భయమెందుకు

మేం అసలు అవినీతికి పాల్పడలేదు. మేం సత్యశీలురం ‘నేటిధాత్రి’ కావాలని చేస్తుంది అని సభ్యత లేకుండా గొంతు చించుకుంటున్న కొంతమంది ఉద్యోగులు ఎందుకు అంతలా భయపడిపోతున్నారో అర్థంకాని విషయం వారు నిజాయితిపరులైతే విచారణకు ఎందుకు డిమాండ్‌ చేయట్లేదు. ప్రభుత్వ నిధులను మెక్కేసి విషయం బయటికి పొక్కడంతో నానా హైరానా పడుతున్న ఉద్యోగులు తమ నిజాయితిని ఎందుకు నిరూపించుకోవడం లేదు. అసలు మనుషులే లేకుండా, వారితో పనే జరగకున్న బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలో డబ్బులు జమ చేయించి ఎవరు ఆ డబ్బులను భోం చేశారో స్పష్టం చేయాలి. రిటైర్‌మెంట్‌కు 8నెలల సమయం కూడా లేని అధికారి సాగిస్తున్న లీలలను ప్రశ్నిస్తే అలా కాదని వివరణ ఇచ్చుకునేదిపోయి ఫోన్‌కాల్స్‌ చేయించి అడ్డంగా ఎందుకు దొరికిపోవాల్సి వచ్చిందో చెప్పాలి. కార్యాలయంలో సీసీ కెమెరాలను అప్‌ చేయించి ఇతగాడు వెలగబెడుతున్న రాచకార్యాలు ఏంటో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇంటర్‌ బోర్డు వద్దన్న లక్షల్లో డబ్బులు దండుకుని నైట్‌ వాచ్‌మెన్‌ను నియమించి డబ్బులు ఇచ్చిన రోజు హాజరుపట్టికలో సంతకం చేయించి మరుసటిరోజు నుంచి సంతకం చేయకుండా, చేసిన పనికి జీతం ఇవ్వకుండా ఎందుకు సతాయించాల్సి వచ్చిందో డిఐఈఓ ఆ ఉద్యోగికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పులన్నీ చేసి ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడే సమాధానంగా వేస్తామంటే ఎలా కుదురుతుంది. ‘గురువింద గింజ’ నీతి బోదిస్తామంటే ఇక్కడ వినడానికి ఎవరు సిద్దంగా లేరని గుర్తుంచుకోవాలి. అధికారిలా, అక్కడ పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల్లా ‘నేటిధాత్రి’ కాసులకు కక్కుర్తి పడదని తెలుసుకోవాలి.

warangallo vyakthi darunahatya, వరంగల్‌లో వ్యక్తి దారుణహత్య

వరంగల్‌లో వ్యక్తి దారుణహత్య

వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. బండరాళ్లతో మోది హత్య చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాత…కొత్త కలయికలో మోడీ క్యాబినెట్‌ : మోడీ కొలువులో కొత్త ముఖాలు

ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తన క్యాబినెట్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో తనతోపాటు మంత్రివర్గంలో పనిచేసిన వారిని కొనసాగించేందుకే మొగ్గుచూపిన మోడీ దాదాపు అందరికి బెర్త్‌ ఖాయం చేశారు. స్మృతి ఇరానీ, నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మల సీతారామన్‌, పీయుష్‌ గోయల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాష్‌ జవదేకర్‌, ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ, కిరణ్‌రిజు, రామ్‌దాస్‌ అక్‌పాలే గతంలో మంత్రివర్గంలో కొనసాగిన వారే. ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని పిఎంఓ నుంచి ఫోన్‌కాల్‌ అందుకున్న వారిలో సాధ్వినిరంజన్‌ జ్యోతి, జితేంద్రసింగ్‌, ప్రహ్లాద్‌జోషి, సంతోష్‌ గంగవార్‌, రావు ఇంద్రజిత్‌ సింగ్‌, రాజ్యసభ ఎంపి మన్‌సుఖ్‌ మండ్‌వియా, అర్జున్‌ మేఘ్‌వాల్‌, పరుషోత్తం రూపాల, రమేష్‌ పోక్రియాల్‌ నిషాంత్‌, బాబూల్‌ సుప్రియో, సదానంద గౌడ్‌, జి.కిషన్‌రెడ్డి, కిషన్‌పాల్‌ గుజ్జార్‌, నిత్యానంద రాయ్‌, సురేష్‌ అంగాడి, హర్‌సిమ్రాత్‌ బాదల్‌ ఉన్నారు.

మోడీ కొలువులో కొత్త ముఖాలు

నరేంద్రమోడీ మంత్రివర్గంలో 12మంది కొత్తవారికి ఈసారి అవకాశం దక్కింది. సురేష్‌ అంగాడి, కిషన్‌రెడ్డి, ప్రహ్లాద్‌ పటేల్‌, రవీంద్రనాథ్‌, కిషన్‌పాల్‌ గుజ్జార్‌, కైలాష్‌చౌదరి, ఆర్‌సిపి సింగ్‌, నిత్యానంద్‌ రామ్‌, దేబశీష్‌ చౌదరి, రామేశ్వర్‌ తెలి, సోంప్రకాష్‌, అర్జున్‌మండా మంత్రి పదవులను దక్కించుకున్నారు.

కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి

తెలంగాణ నుంచి మోడీ కొలువులో సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి చోటు దక్కించుకున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన తెలంగాణలో బిజెపికి ఉన్న ఎంపీలలో ఆయన సీనియర్‌ నేత. బిజెపి పార్టీకి బద్దుడిగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరున్న కిషన్‌రెడ్డి జనతా పార్టీ ప్రారంభం నుంచి అందులో కొనసాగుతున్నారు. మూడుపర్యాయాలు అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన కిషన్‌రెడ్డికి తెలంగాణలో బిజెపి పార్టీని బలపరిచే దిశగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. వ్యూహాత్మకంగానే బిజెపి ఆయనకు మంత్రి పదవిని అప్పగించింది.

అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి

అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి. వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపుకు సంబందించిన డబ్బులను పనిచేయనివారికి పనిచేసినట్టుగా, రెగ్యులర్‌ ఉద్యోగలను క్యాంపులో భాయ్స్‌గా పనిచేసినట్టుగా తప్పుడు లెక్కలు రాసి వారి అకౌంట్లలో వేశారని, వీరిద్దరే కాకుండా బయట వారి అకౌంట్లను సేకరించి దొంగ పేర్లను రాసి అక్రమంగా చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేసుకున్న అవినీతి ఉద్యోగులను గుర్తించి వారిని సస్పెండ్‌ చేయాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూరం రనీల్‌, రాజులు ఫ్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీసీ కెమెరాలు ఎందుకు బంద్‌ చేశారో చెప్పాలి

డిఐఈవో కార్యాలయంలో ఏప్రిల్‌ నుండి మే వరకు కార్యాలయంలో ఎందుకు సీసీ కెమెరాలు బంద్‌ చేశారో డిఐఈవో ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక వైపు సీసీ కెమెరాలను ప్రతి చోటా అమర్చుకోవాలని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, పోలాస్‌యంత్రాంగం చెబుతుంటే డిఐఈవో కార్యాలయంలో మాత్రం ఉన్న కెమెరాలను ఎందుకు బంద్‌ చేయాల్పి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం జిల్లా కమిటి డిఐఈవోను డిమాండ్‌ చేశారు. ప్రతి ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కళాశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పే డిఐఈవో తాను తన కార్యాలయంలో ఎందుకు బంద్‌ చేయాల్సి వచ్చిందో అంతుచిక్కడం లేదని, పలు అనుమానాలకు తావునిస్తున్నదని వారు ఈ సందర్బంగా అన్నారు.

రాత్రి వేళలో ఆఫీస్‌లో ఉంటున్నదెవరు…?

ఇంటర్మీడియట్‌ ఆర్బన్‌ ప్రదానకార్యాలయంలో గత నాలుగు నెలల నుండి ఓ వ్యక్తి రాత్రి వేళలో కార్యాలయంలోనే ఉంటున్నాడని, అక్కడే నిద్రిస్తున్నాడని అతను నైట్‌వాచ్‌మెనా…? అపరిచిత వ్యక్తి ఏమైనా ఉంటున్నాడా…? అని అర్ధం కావడంలేదని రనీల్‌, రాజులు అంటున్నారు. ఆయన అధికారిక నైట్‌వాచ్‌మెనా…? ప్రైవేటు నైట్‌వాచ్‌మెనా? తెలియకుండా ఉన్నదని, అతను ఎవరో అధికారులే వెల్లడించాలని వారు కోరారు.

nadicheruvulo sedyapu kunta thavvakam, నడిచెరువులో సేద్యపు కుంట తవ్వకం

నడిచెరువులో సేద్యపు కుంట తవ్వకం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల వ్యవసాయ బావులు, బోర్లల్లో భూగర్భ జలాలు పెంపొందించడానికి వారి భూముల్లోనే పాంపౌండ్‌ (సేద్యపు కుంట)లను ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టి కొనసాగిస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేయవలసిన పనులను రైతుల సొంత వ్యవసాయ భూముల్లో చేపట్టాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా నర్సంపేట డివిజన్‌లోని కొన్ని గ్రామాలల్లో పనులు చేపడుతున్నారు. గ్రామాల్లో సేద్యపు కుంటల నిర్మాణం చేపట్టడానికి సంబంధిత గ్రామ ఫీల్డ్‌ అసిస్టెంట్లు రైతుల వ్యవసాయ భూములతోపాటు పూర్తి వివరాలను పైఅధికారులకు వివరించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలోని కన్నెచెరువు వద్ద సేద్యపు కుంట పనులను జరుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఫాంపాండ్‌ నిర్మాణ పనులను చెరువులోనే చేస్తున్నారని, దానివల్ల ఫలితం ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. చెరువులోనే పాంపౌండ్‌ నిర్మాణం చేయటం వలన వర్షాకాలంలో చెరువు పూర్తిగా నిండుతుందని తెలిపారు. చెరువులో తవ్వడం వలన లాభం ఏం జరుగుతుందని, చెరువులో నీరు ఉన్నా సేద్యపుకుంటలో నీరు ఉన్నా రెండు సమానమే అని తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయలు వథా అవుతున్నాయని, రైతుల భూముల్లో చేపట్టాల్సిన పనులను చెరువులో చేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

upadi hami panulu besh, ఉపాధిహామీ పనులు బేష్‌

ఉపాధిహామీ పనులు బేష్‌

హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బుర్ర శ్రీధర్‌, ఎపిఓ విజయలక్ష్మి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పనులు చేస్తున్నారని, ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇంటి దగ్గరనే ఉండి గ్రామంలో ప్రతి ఒక్కరు పనులకు వస్తున్నారు. వందలమందికి పని దొరకడం వలన పనులకు వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు, ఎపిఓలు గుర్తించి ఇప్పటి వరకు సరిపడా పనిదినాలు పూర్తి చేస్తున్నారని అన్నారు. చెరువుల పూడికతీతలు, నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయని, కూలీలకు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పనులు చేస్తున్నట్లు తెలిపారు.

drunk and drive thanikilu,  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా వరంగల్‌ సికేఎం హాస్పిటల్‌ ప్రాంతంలో మద్యం సేవించి, మైనర్లు వాహనాలు నడపడం ద్విచక్రవాహనాలకు వివిధరకాల శబ్దాలను చేసే సైలెన్సర్‌ వాహనాలకు లైసెన్సు ఇంకా ఇతర పత్రాలు లేని వాహనదారులకు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేసిన వాహనదారులకు చాలాన్‌ వేసి కేసులు విధించడం జరిగిందని వరంగల్‌ ట్రాఫిక్‌ సిఐ టి.స్వామి తెలిపారు. ఇప్పటి వరకు 23వేల రూపాయలు జరిమానా విధించామన్నారు. ఇరుకుగా ఉండి ప్రధానంగా సికేఎం హాస్పిటల్‌లో ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చి వెళ్లే గర్భిణీ స్త్రీలకు ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వరంగల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ నుండి హాస్పిటల్‌ వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో పూల దుకాణాలు, ఇంకా వివిధ రకాల వ్యాపారస్తులు రోడ్లపై వస్తువులు ఉంచడం వల్ల వాహనదారులకు ఇబ్బంది అవుతుందని, అందులో మద్యం సేవించి, మైనర్లు ఇంకా త్రిబుల్‌ రైడింగ్‌ నివారించటానికి తనికీలు చేపట్టామని చెప్పారు. ఈ తనికీల్లో వరంగల్‌ ట్రాఫిక్‌ ఎస్సైలు, ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.

rjdga badyathalu swekarinchina jayapradabai, ఆర్జేడిగా బాధ్యతలు స్వీకరించిన జయప్రదబాయి

ఆర్జేడిగా బాధ్యతలు స్వీకరించిన జయప్రదబాయి

ఇంటర్మీడియట్‌ విద్య వరంగల్‌ నూతన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడి)గా బి.జయప్రదబాయి గురువారం విధుల్లో చేరారు. హైదరాబాద్‌ డిఐఈఓగా పనిచేస్తున్న ఆమెను వరంగల్‌ ఆర్జేడి (పూర్తి అదనపు బాధ్యతలు)గా నియమిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎ.అశోక్‌ జారీ చేసిన ఉత్తర్వులను అందుకుని వరంగల్‌ ఆర్జేడి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్యాలయ సూపరింటెండెంట్‌ కృష్ణమోహన్‌రెడ్డితోపాటు పలువురు సిబ్బంది ఉన్నారు.

gramala uvakule deshaniki pattukommalu, గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు

గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు

గ్రామాల్లో ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని డిసిపి నాగరాజు అన్నారు. గురువారం సాయంత్రం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట ఏసీపీ సునీతమోహన్‌ ఆధ్వర్యంలో కార్టన్‌సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో తనిఖీలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ఆధార్‌కార్డులు పరిశీలన, గ్రామాల్లోని ద్విచక్రవాహనాలకు లైసెన్సులు, ఇన్సూరెన్సుతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలు లేని ద్విచక్రవాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి నాగరాజు మాట్లాడుతూ గ్రామాలల్లో రైతులు విత్తనాలు తీసుకొనేటప్పుడు కల్తీ విత్తనాలకు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏసీపీ సునీతామోహన్‌ మాట్లాడుతూ వేసవికాలంలో ఆరుబయట నిద్రపోకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా సూచనలు పాటించాలని, చిన్న వయస్సులోనే మద్యానికి బానిసై అధిక వేగంతో ద్విచక్రవాహనాలు నడుపుతున్నారని యువతను ఉద్దేశించి మాట్లాడారు. నర్సంపేట టౌన్‌ సీఐ దేవేందర్‌రెడ్డి, నెక్కొండ సిఐ పెద్దన్నకుమార్‌, నర్సంపేట ఎస్సై నాగ్‌నాథ్‌, దుగ్గొండి ఎస్సై సాంబమూర్తి, చెన్నారావుపేట ఎస్సై జగదీష్‌, ఏఎసైలు, కానిస్టేబుల్స్‌, సిటీ గార్డ్‌ పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.

bamatho…boss, ‘భామ’తో…బాస్‌

‘భామ’తో…బాస్‌

‘గులాబి’ సినిమాలో హీరో హీరోయిన్‌తో బైక్‌పై చెక్కర్లు కొట్టే సన్నివేశం చూశాం. బైక్‌పైనే డ్యూయెట్‌ సాంగ్స్‌ పాడుకోవడం విన్నాం. అదంతా సినిమా మయం. సేమ్‌ అలాగే ప్రేమప్రయాణం సాగించాలనుకున్నాడో ఏమో..? మంచి బుద్దులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా యువకుడై ప్రేమప్రయాణం చేస్తున్నాడు. పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకొని ఆ అధికారి ఓ మహిళతో ‘ప్రేమలీలలు’ సాగిస్తున్నాడు. వీరి ప్రేమ ఏకంగా ఆ అధికారి పనిచేసే కార్యాలయంలోనే కలుసుకునేంత వరకు వచ్చింది. హద్దులు మీరిన వీరి ప్రేమ సరసానికి కార్యాలయంలోని సీసీ కెమెరాలు సైతం సిగ్గుపడి తలదించుకునే పరిస్థితికి వచ్చింది.

( ‘భామ’తో…బాస్‌ లీలలు త్వరలో…)

rjdnyna…kammestham…,’ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

‘ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

నేను తలుచుకుంటే ఎవ్వరినైనా మేనేజ్‌ చేయగలను…నాకు ఇంటర్‌బోర్డులో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి..కమీషనర్‌ నాకు బాగా క్లోజ్‌..గతంలో ఓ ఆర్జేడిని సస్పెండ్‌ చేయించింది ఎవరో తెలుసా…కళ్లు మూసుకొని ఎన్నో ప్రైవేటు కాలేజీలకు చిటికెలో అనుమతులు ఇచ్చినోన్ని…గప్పుడే నన్ను ఏం చేయలేకపోయారు..గిప్పుడు ఎవరొస్తరు..ఏం చేత్తరు…ఇంతకంటే ఆఫీస్‌లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిన దాఖలాలు లేవా..? మనం నొక్కింది ఏమన్నా కోట్ల రూపాయాలా..? కేవలం లక్షలే కదా..! దీనికి భయపడుడెందుకు..నేనున్నా..మీరు ధైర్యంగా ఉండండి… అన్ని నేను చూసుకుంటాను…నా వాటా నాకు ఇవ్వండి చాలు, మిగితావన్ని నేను మేనేజ్‌ చేస్తా…అంటున్నాడట ఓ అధికారి. ఇదంతా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులకు ఆ అధికారి భరోసాను కల్పిస్తున్నాడని ఈయన అండదండలతోనే వారు అవినీతికి పాల్పడ్డారని పలువురు చర్చించుకుంటుండటంతో ఆ నోటా..ఈ నోటా విషయం మొత్తం జిల్లాను దాటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీరి అవినీతి భగోతాన్నే మాట్లాడుకుంటున్నారని సమాచారం.

ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు…

అవినీతి లీలలపై విచారణ కమిటి వేస్తే దొరికిపోవడం ఖాయం సార్‌..అంటున్న కొందరి ఉద్యోగులతో మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు..నాకు ఇంటర్‌బోర్డులో పెద్దసార్లు తెలుసు నేను ఎలాచెబితే అలా వింటారు..అసలు కమిటి వేయరు..వేసినా ఇక్కడి రాక ముందే మేనేజ్‌ చేస్తాను, మీరు ఏం భయపడవద్దని అవినీతికి పాల్పడిన దొంగలకు ధైర్యం చెబుతున్నాడని బయట ప్రచారం జరుగుతున్నది.

నా వాటా నాకు ఇస్తే చాలు

మీరెంతన్నా నొక్కండి..నొక్కేసిన దాంట్లో నాకు మాత్రం నా వాటా ఇస్తే చాలు మిగితావన్ని నేను చూసుకుంటాను, రిజిష్లర్లు మార్చుడు, బిల్లులు సృష్టించుడు, దొంగసంతకాలు చేసుడు, దొంగ పేర్లను ఎంట్రీ చేసుడు, లేని సంతకాలు పెట్టుడు, దొంగల అకౌంట్లు ఇక్కడ భాయ్స్‌గా పని చేసినవారేనని చెప్పుడు.. ఎంతసేపు పని మీరేమి భయపడకండి, నా వాటా నాకు ఇస్తే గివన్ని మేనేజ్‌చేసుడు పెద్ద సుతారమా..? అని ఓ అధికారి వీరికి కొండంత అండగా నిలుసున్నాడని, అతని పేరు చెప్పకుండా కొంతమంది గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

si vedipulaku yuvakudu bali, ఎస్సై వేధింపులకు యువకుడు బలి

ఎస్సై వేధింపులకు యువకుడు బలి

సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవ విషయంలో తలదూర్చిన సంగెం ఎస్సై నాగరాజు ఇజ్జిగిరి కార్తీక్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తన కుమారుడిని తీవ్రంగా కొట్టిన విషయంలో కార్తీక్‌ తండ్రి లక్ష్మిపతి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఎస్సైపై చర్యలు తీసుకోక ముందే కార్తీక్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఎస్సై నాగరాజు ఓవరాక్షన్‌ మూలంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడాని మృతుడి తండ్రి లక్ష్మిపతి ఆరోపించారు. శవాన్ని సైతం పోస్టుమార్టమ్‌ త్వరగా చేయకుండా అడ్డుకుంటున్నారని తన కోడలుపై తప్ప ఎస్సైపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని సీఐ తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని లక్ష్మిపతి ఆరోపించారు. భార్యాభర్తల గొడవలు పరిష్కారం చేయమని కౌన్సిలింగ్‌ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళితే తన కుమారుడిని తీవ్రంగా చితకబాది ఆత్మహత్య చేసుకునేలా చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడి చావుకు కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

cini prashamsinchina cp, సీఐను ప్రశంసించిన సీపీ

సీఐను ప్రశంసించిన సీపీ

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ప్రశంసించారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డిని పోలీసుల సమక్షంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదేనని తెలిపారు. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసుశాఖకే గౌరవం తీసుకువస్తాయని ఉద్ఘాటించారు.

pds biyyam pattivetha, పిడిఎస్‌ బియ్యం పట్టివేత

పిడిఎస్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యాన్ని ఆర్‌పిఎఫ్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఆర్‌పిఎఫ్‌ ఎస్సై కె. రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం…తాను, తన సిబ్బంది తమ విధినిర్వహణలో భాగంగా టిఎన్‌ 17201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో తనిఖీలు చేపట్టారు. తనికీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యం బస్తాలు కనిపించడంతో అవి ఎవరివి అని విచారించారు. వాటిని తరలిస్తున్న వారెవరు ఎవరు చెప్పకపోవడంతో ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది లైసెన్స్‌ పోర్టర్‌ల సహకారంతో అక్రమంగా తరలిస్తున్న 25బస్తాలు సుమారు 800కిలోల పిడిఎస్‌ బియ్యంపై తగు చర్య తీసుకునేందుకు రైల్వేస్టేషన్‌లోనే దించివేశామని తెలిపారు. అనంతరం వీటిని సివిల్‌ సప్లై అధికారులకు అప్పగించనున్నారు.

bakthajana sandramga kondagattu divyakshtram, భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అర్ధరాత్రి నుంచే ఆలయం కిక్కిరిసిపోయింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా కఠోరదీక్షతో ఇరుముడితో తరలివచ్చిన మాలదారులు అంజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకుని దీక్ష విరమణ చేస్తున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఏ వైపు చూసినా రామనామ జపంతో ఆలయం మారుమోగింది.

గట్టి భద్రతా ఏర్పాట్లు

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో 450మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. ఎస్పీ సింధూశర్మ దగ్గర ఉండి భద్రతను పర్యవేక్షించారు.

gananga hanuman jayanthi vedukalu, ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు

ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు

వర్థన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ జయంతి, దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు బుధ, గురువారాలు రెండురోజులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ కౌడగాని కవితరాంబాబు, శివాని విద్యాసంస్థల చైర్మన్‌ తాళ్లపల్లి స్వామి, శుభనందిని సంస్థల చైర్మన్‌ కౌడగాని రాంబాబు, గ్రామ పాలకవర్గం, ఆలయ కమిటి సభ్యులు, గ్రామస్తులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version