gananga chandrababu janmadina vedukalu, ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 69వ జన్మదిన వేడుకలను పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగెల్లి సురేష్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణ కేంద్రంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిమిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎక్కడ నిర్వహించినా అభివృద్దే ధ్యేయంగా పనిచేయడమే ఆయన లక్ష్యమని అన్నారు. 69ఏళ్ల వయసులో కూడా ప్రజాసేవలో ముందుకు వెళుతున్న ఆయన మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో తెలుగు యువత మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ జూబేర్‌, నాయకులు సేహగల్‌ బాబా, రాజ్‌ కుమార్‌, రాము, తుమ్మల విజయ్‌, జాణ్సణ్‌, బంగారు ప్రశాంత్‌ తదితరులు పాల్గోన్నారు.

105 samvasarala veduka, 105 సవత్సరాల వేడుక

105 సవత్సరాల వేడుక

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్థన్నపేట మండలం కట్రియాల గ్రామంలో ఓ అవ్వ 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల మల్లమ్మకు నాలుగు తరాలకు చెందిన కొడుకులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాల్లు అందరు కలసి శతదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తబట్టలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. మల్లమ్మ కొడుకులు చెవ్వల్ల బొంద్యాలు, సత్తయ్య, చేరాలు, రామక్క, వారి కుటుంబాలు స్వగ్రామమైన కట్రియాలలో శతదిన వేడుకలు చేసుకున్నారు.

nagaramlo kukkalu…bowboiye, నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ !

నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ !

మొరిగే కుక్క కరవదంటారు…కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు…మొరిగే కుక్కలు సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజలను కుక్కలు వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు ద్విచక్రవాహనంపై వెళ్లే వారిని కూడా కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా…బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరుకోవాలన్నా బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. కుక్కల బెడద నివారించండి మహాప్రభో…అని ప్రజలు అనేకసార్లు డివిజన్‌ కార్పొరేటర్లకు, వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు ఆ దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్క కాటుకు ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నా అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు వీరవిహారం చేస్తున్నాయని, రాత్రి సమయాల్లో రోడ్డుపై ఆటో దిగి ఇంటికి వెళ్లే దారిలో ఖచ్చితంగా కుక్కల బారిన పడవలసి వస్తుందని ప్రజలు చెపుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం నగరంలో జరుగుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఇటీవల కుక్కలు చిన్నారులను లక్ష్యంగా చేసుకుని గాయాలపాలు చేస్తున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో కుక్కల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రేటర్‌ అధికారులు కుక్కల బెడదను తీవ్రంగా పరిగణించి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో కరీమాబాద్‌, శివనగర్‌, రామన్నపేట, రంగశాయిపేట్‌, అండర్‌ రైల్వే గేట్‌, గిర్మాజీపేట, కాశిబుగ్గ వివిధ ప్రాంతాలలో ఈ వీధి కుక్కలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. వీధి వీధినా గుంపులు గుంపులుగా దర్శనం ఇవ్వటంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరంగల్‌ నగరంలో వీధికుక్కల విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఏ రోడ్డులో చూసిన కుక్కలు గుంపులుగుంపులుగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు సెలవులు ఇవ్వటం వల్ల ఇంటి ఆవరణలో ఆడుకోవటానికి బయటకు వెళ్లాలంటే వీధికుక్కలను చూసి బయటకు వెళ్లడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇంట్లోనే ఉండి టివి చూస్తూ గడుపుతున్నారని, దీంతో వారు సంతోషంగా వేసవి సెలవులను గడపడం లేదని అన్నారు. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులపై వెళుతున్న వారి వెంటపడి కుక్కలు మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల 21వ డివిజన్‌ కరీమాబాద్‌ గుండుబావులు ప్రాంతంలో ఒక చిన్నారి కుక్క కాటుకు గురి కావటం జరిగింది. నగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని నివారించాలని కార్పొరేటర్లకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మనుషుల మీద పడి కరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాలలో వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. రాత్రివేళల్లో చిన్నపిల్లలకు కుక్కల అరుపులకు నిద్ర పట్టక ఆరుబయట పిల్లలను నిద్రించేందుకు ఉపక్రమిస్తే ఎక్కడ కుక్కలు వచ్చి పీక్కుతింటాయోనని భయంతో నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొందని, అదేవిధంగా అత్యవసర పనులపై బయటకు రావాలంటే భయాందోళనకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని నగరంలో వీధికుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాల్లో వదిలివేయడానికి చర్యలు చేపడుతున్నామని, కుక్కల కొరకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొంత బడ్జెట్‌ విడుదల చేసినా చర్యలకు మాత్రం అధికారులు చొరవ చూపడం లేదని వాపోయారు. మునిసిపల్‌ కమిషనర్‌కి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా లాభం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. అయితే నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికయినా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు స్పందించి కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని నగర ప్రజలు వేడుకుంటున్నారు.

si ratha parikshaku policela advaryamlo help desk, ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్‌’ డెస్క్‌

ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్‌’ డెస్క్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శని, ఆదివారాల్లో జరిగే స్టయిఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్షకు నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎస్సై తుది రాత పరీక్షకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు ముఖ్యమైన కూడళ్లల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలియజేయడంతోపాటు అభ్యర్థులు తెలుసుకునేందుకు వీలుగా ముఖ్యకూడళ్లలో పరీక్షా కేంద్రానికి దారిని తెలుపుతూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో పరీక్ష రాసే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పోలీసులు అందిస్తున్న సహకారానికి తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

sushrita devarsh samadini smaraka smruthivanamga prakatinchali, సుశృత దేవర్ష్‌ సమాధిని స్మారక స్మృతివనంగా ప్రకటించాలి

 

కోమల పోరాటాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

సుశృత-దేవర్ష్‌ల సమాధిని స్మారక స్మృతివనంగా ప్రకటించాలని, సుశృత తల్లి కందిక కోమల చేస్తున్న పోరాటాన్ని అడ్డుకుంటున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని సుశృత-దేవర్ష్‌ న్యాయపోరాట సంఘీభావ కమిటీ జనగామ జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుశృత-దేవర్ష్‌ భార్యబిడ్డలున దారుణంగా చంపిన హంతకుడు మాచర్ల రమేష్‌ ఇంటి ఎదుట సుశృత తల్లి కందిక కోమల సమాధి కట్టిందని, ఫిబ్రవరి 10వ తేదీ నుండి సమాధిని సుశృత-దేవర్ష్‌ స్మారక స్మృతివనంగా ప్రకటించాలని, రిలే నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. దీక్షలు నేటికి 64రోజుకు చేరుకుందని తెలిపారు. కోమల చేస్తున్న పోరాటానికి మద్దతుగా దళిత, ప్రజాసంఘాలు సుశృత-దేవర్ష్‌ న్యాయపోరాట సంఘీభావ కమిటీగా ఏర్పడిందని, డిమాండ్ల సాధన కోసం జనగామ జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లను కలిసిందని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత స్మారక స్మృతివనం డిమాండ్‌ను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. హామీ నెరవేరకుండానే పాలకుర్తి సీఐ, ఎస్సైలు దీక్షలో కూర్చున్న కోమలపై బెదిరింపులకు పాల్పడుతూ పోరాటాన్ని విరమించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. కోమల పోరాటానికి అడ్డుపడుతున్న సీఐ, ఎస్సైలపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్‌ను కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశృత-దేవర్ష్‌ న్యాయ పోరాట సంఘీభావ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య, రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం సదానందం, జనగామ జిల్లా నాయకుడు గట్టు సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

acb valalo forest adhikarini, ఏసీబీ వలలో ఫారెస్ట్‌ అధికారిణి

ఏసీబీ వలలో ఫారెస్ట్‌ అధికారిణి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం…నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ అనిత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. తోటి ఉద్యోగి సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. ఇందులో సిరిసిల్ల జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ వేముల శ్రీనివాస్‌ హస్తం కూడా ఉందనే అనుమానంతో ఏసీబీ అధికారులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పారెస్ట్‌ ఆఫీసర్‌గా అనిత పనిచేసినట్లు సమాచారం.

 

si thudi rathapariksha nirvahanaku erpatulu purthi, ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌
వరంగల్‌ నగరంలో నిర్వహించే ఎస్సై తుది రాతపరీక్షను సజావు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డ్‌ ద్వారా సబ్‌-ఇన్స్‌స్పెక్టర్‌ (సివిల్‌) ఉద్యోగాల నియామాకాలలో భాగంగా శని, ఆదివారాలలో నిర్వహించే తుది రాతపరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై వరంగల్‌ రీజీనల్‌ కో-ఆర్డినేటర్‌ (కేయూ ఇంజనీరింగ్‌ విభాగం ప్రిన్స్‌పల్‌) ఫ్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి, పోలీస్‌ నోడల్‌ అధికారి వెస్ట్‌జోన్‌ డిసిపి బి.శ్రీనివాస్‌రెడ్డి, బయోమెట్రిక్‌ విభాగం అధికారి షీం టీం ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావుతో పోలీస్‌ కమీషనర్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షా కేంద్రాల నిర్వహణ, పోలీస్‌ బందోస్తుతోపాటు ప్రశ్న, జవాబుల పత్రాలకు సంబంధించి తీసుకుంటున్న భద్రతపై పోలీసు కమిషనర్‌ అధికారలతో సమీక్షా జరిపారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ రాత పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, 11,874మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ రాతపరీక్షలను 19 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం 2.30గంటల నుండి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహింబడుతుందని తెలిపారు. ఈ పరీక్షకు19మంది చీఫ్‌ సూపరింటెండెట్లు, 26మంది పరిశీలకులు, 56మంది బయోమెట్రిక్‌ ఇన్విజిలేటర్లతోపాటు బందోబస్తు నిమిత్తం ఇన్స్‌స్పెక్టర్లు7, ఎస్సైలు14, 90మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్లతోపాటు, పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులను తనీఖీ చేసేందుకు 72మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుండగా, ఇందులో 30మంది మహిళా పోలీసులు ఉన్నారని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు తెలుసుకునేందుకు పోలీసుల అధ్వర్యంలో బస్టాండ్స్‌, రైల్వేస్టేషన్లు, ముఖ్యకూడళ్లల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, ప్రధాన మార్గాలతోపాటు ముఖ్య మార్గాల్లో అభ్యర్థులకు కనిపించే విధంగా పరీక్షా కేంద్రాల సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు పరీక్ష నిర్వహించే ప్రాంతాలకు వేళ్ళేందుకు రైల్వే, బస్టాండ్స్‌ నుండి అదనంగా ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేశామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.
అభ్యర్థులు చేయకూడనవి:
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమించరని, బయోమెట్రిక్‌ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు పరీక్ష గదిలో తీసుకుంటారని, ఎవరైనా ఒకరికి బదులు మరోకరూ పరీక్ష రాయాటానికి ప్రయత్నిస్తే సులువుగా పట్టుబడుతారని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్లు, ట్యాబులు, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌, వాచ్‌లు, క్యాలిక్యులేటుర్లు, పర్సులను పరీక్ష కేంద్రానికి అనుమతించరని, చేతులకు మెహింది వేసుకోని వచ్చే అభ్యర్థులను అనుమతించరని తెలిపారు.
అభ్యర్థులు చేయాల్సినవి:
అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని, కావున అభ్యర్థులు నిర్థేశించిన సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు హల్‌ టికెట్‌, బాక్ల్‌ లేదా బ్లూ పెన్‌ తప్పనిసరి తెచ్చుకోవాలని, అభ్యర్థులు ఈ మధ్యకాలంలో దిగినటువంటి పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో ఒకటి ఖచ్చితంగా తీసుకరావాలని తెలిపారు.

telangana pcc organision secretaryga gujjula srinivas, తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గుజ్జూల శ్రీనివాస్‌

తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గుజ్జూల శ్రీనివాస్‌

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్‌ సెక్రటీరగా నియమితులైన శ్రీనివాస్‌రెడ్డి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని, తన నియమాకానికి సహకరించిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

anndanam mahadanam, అన్నదానం మహాదానం

అన్నదానం మహాదానం

అన్నదానం మహాదానమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవేందర్‌ అన్నారు. శుక్రవారం జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం జాతీయ కన్వీనర్‌ నాగవేళ్ళి నరేంద్ర కుమారుడు నాగవేళ్ళి సాయి శ్రీశాంత్‌ వర్థంతిని ఎన్‌ఎస్‌ఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయి ప్రశాంత్‌ వర్థంతి సందర్భంగా వరంగల్‌లోని లూయిస్‌ అంధవిధ్యార్థుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాడ దేవేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరులకు సేవ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం పౌండేషన్‌ తరపున సభ్యులు, యూత్‌ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నాగవేళ్ళి సరిత నరేంధర్‌, కట్టా రాఘవేందర్‌, కుమారస్వామి, ఉపాధ్యక్షుడు కందికోండ వేంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి అనిశేట్టి వేంకటేశ్‌, శ్రీనివాస్‌, గుజ్జారి శ్రీధర్‌ సినీ గాయకుడు రాజేందర్‌, స్వరూప, వీనీల, చేతనకుమార్‌, సాయి సిధ్ధాంత్‌, యూత్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

karyakarthalaku andaga vunta, కార్యకర్తలకు అండగా ఉంటా

కార్యకర్తలకు అండగా ఉంటా

పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శుక్రవారం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు మాడిశెట్టి కవితకు ఆర్థిక సహాయం అందజేశారు. 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి ద్వారా కవితకు 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే ఆర్థికంగా ఆదుకోవడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారుల సంఘం కన్వీనర్‌ మరుపల్ల రవి, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నిమ్మల సదానందంయాదవ్‌, శెంకేశి కుమారస్వామి, బక్కి రమాదేవి, మరుపల్ల గీత తదితరులు పాల్గొన్నారు.

chali pidugu miglichina vishadam, చలి పిడుగు మిగిల్చిన విషాదం

చలి పిడుగు మిగిల్చిన విషాదం

ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామశివారులో గొర్రెల మందపై పిడుగుపడడంతో పెద్దఎత్తున 35గొర్రెలు మతువాత పడ్డాయి. చీర రాజారామ్‌కు చెందిన భూమిలో మందను నిర్వహించారు. గురువారం రాత్రి అకాలవర్షంలో చలి పిడుగు గొర్రెల మండపై పడింది. పెద్దసంఖ్యలో చిన్న, పెద్ద గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇందులో మజ్జిగ రాజుకు చెందిన 8గొర్రెలు, దయ్యాల రాజుకు చెందిన 20గొర్రెలు, బండారి చంద్రుకు చెందిన 5గొర్రెలు మృతిచెందాయి. అందులో భాగంగా ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ మజ్జిగ జయపాల్‌, సర్పంచ్‌ దయాకర్‌, ఎంపీటీసీ కావ్య తిరుపతి, చీర గణేష్‌ తదితరులు జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వెంకటాపురం గ్రామానికి చెందిన నీలం ఫకీర్‌ యాదవ్‌(50) పిడుగుపాటుకు మతిచెందారు.

ashakaryakarthalaku okaroju shikshana karyakramam, ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, బోద వ్యాధి, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వ్యాధులు వస్తాయని, వీటి నివారణలో ఆశాకార్యకర్తల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. 2030 సంవత్సరానికి మలేరియాను పూర్తిగా నివారించాలనేది లక్ష్యం అన్నారు. మలేరియా వ్యాధి వ్యాప్తి జూన్‌ నుండి నవంబర్‌లో ఎక్కువగా ఉంటుందని, అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి కారకం ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వర్షాకాలంలో దోమలు పెరుగు ప్రదేశాలు ఎక్కువగా వ్యాధి కూడా అదే సమయంలో ఎక్కువ ప్రబలుతుందన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి ప్రాణాంతక స్థాయికి చేరుతుందని తెలిపారు. బోధ వ్యాధి, డెంగ్యూ, చికెన్‌ గున్యా, మెదడు వాపు వ్యాధుల లక్షణాలు, చికిత్స, నివారణ చర్యల గురించి వివరించారు. ముఖ్యంగా ఫ్రైడే డ్రైడేగా పాటించాలని, పరిసరాలలో నీరు నిలవకుండా చూడాలని, ప్రతి ఆశా కార్యకర్త గృహ సందర్శనకు వెళ్లినప్పుడు ఇంటి పరిసరాలలో పరిశుభ్రత, డ్రైడే ప్రాముఖ్యత గురించి తెలిపారు. జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.శ్రీ|రాములు మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. శిక్షణ అనంతరం ఆశా కార్యకర్తలకు రక్తపూత పరీక్షలు ఎలా చేయాలనే దానిపై ల్యాబ్‌ టెక్నిషియన్‌ శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు, డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ అనిల్‌కుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంపత్‌, సిహెచ్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఇఓలు లింగం, ఎల్లంకి శ్రీనివాస్‌, హెచ్‌ఇలు వెంకటేశం, సంపత్‌, డిపిఓ ఉమాదేవి, డిపిహెచ్‌ఎన్‌ దయామని, హెచ్‌ఎస్‌ సుజాత, భరత్‌ పాల్గొన్నారు.

…………………………………..

gudumbha stavaralapia dadulu, గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్సై అశోక్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని బేస్తగూడెం గ్రామంలో, గ్రామం చుట్టుపక్కల గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 500లీటర్ల పానకం, 10గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దుర్గం లక్ష్మిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సైతోపాటు సిబ్బంది శ్రీనివాస్‌, నవీన్‌, తిరుపతి, వీరన్న పాల్గొన్నారు.

flatphom bayata kuragayalanu vikrainchakudadu, ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించకూడదు

ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించకూడదు

కూరగాయల విక్రయదారులు వారికి కేటాయించిన ప్లాట్‌పామ్స్‌లలోనే కూరగాయలను విక్రయించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమీషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 13వ వార్డులో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇతర మౌళిక వసతులు తదితరులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇంజనీర్‌ విభాగం సిబ్బందికి సూచించారు. అనంతరం మార్కెట్‌ ఏరియాను సందర్శించారు. ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించడం మూలంగా రవాణా, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వారికి కూడా ప్లాట్‌ఫామ్స్‌కు నెంబర్లు కేటాయించి బయట కూర్చున్న విక్రయదారులను కూడా ప్లాట్‌పామ్‌లలోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ గుండ్లపెల్లి పూర్ణచందర్‌, పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

vathavarana shaka hesharika, వాతావరణ శాఖ హెచ్చరిక

వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా..గురువారం వాటి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎండలో బయటకు రావద్దని వాతావరణశాఖ సహాయ అధికారి వెంకట్రావు సూచించారు. గురువారం ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని, దీని వల్ల ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు పగలూ ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ellu kabza chesharani atmahatyayatnam, ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం

ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ సిటి : ఇల్లు కబ్జా చేశారని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్‌ కాశిబుగ్గ గ్లోబల్‌ స్కూల్‌ వద్ద తౌటం చక్రపాణి అనే వ్యక్తి అద్దెకు వచ్చి ఇంటిని కబ్జా చేసారంటూ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఈగ బిక్షపతి, భార్య, కూతురును చుట్టుపక్కల కాలనీవాసులు అడ్డుకున్నారు. కేసును ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదితుడు బిక్షపతి మాట్లాడుతూ అమ్మ, నాన్న సంపాందించిన ఆస్తిలో మేము ఉంటున్నామని, కూలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నమని, గత పదిసంవత్సరాల క్రితం తౌటం చక్రపాణి అనే వ్యక్తి మా ఇంట్లోకి అద్దెకు వచ్చాడని తెలిపారు. నాకు పిల్లలు లేరని తెలుసుకుని తౌటం చక్రపాణి, అతని భర్య ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని తీసుకువచ్చి మాకు ఇచ్చారని, కొన్ని రోజుల తరువాత మీకు అమ్మాయిని ఇచ్చామని, మాకు ఆస్తిలో వాటా ఇవ్వాలని ఎన్నో మార్లు వేదింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాయమాటలు చెప్పి మద్యం అలవాటు చేసి సంతకాలు చేయించుకున్నారని అన్నారు. ఈ విషయంలో మాకు ఎన్నిసార్లు పోలీసులకు పిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని, కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బాదితులను పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

 

atm chorulunnaru, ఏటీఎమ్‌ చోరులున్నారు..

ఏటీఎమ్‌ చోరులున్నారు..

సైబరాబాద్‌ డీసీపీ క్రైమ్స్‌ రోహిణీ ప్రియదర్శిని

బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్‌ నేరగాళ్లు నయా దారులు వెతుకుతున్నారని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని పంజా విసురుతున్నారని, ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఖాతాల్లోంచి వేలాది రూపాయలు ఎగిరిపోతున్నాయని తెలిపారు. ఈ ఘరానా మోసం పేరే ‘స్కిమ్మింగ్‌’ అంటారని చెప్పారు. గతంలో కస్టమర్లకు ఫోన్‌ చేసి బ్యాంక్‌ అధికారులమని నమ్మబలుకుతూ వారి నుంచి ఏటీఎం కార్డు నంబర్‌, పిన్‌ నంబర్‌ తదితర సమాచారాన్ని తెలుసుకొని ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టేవారని, బ్యాంకులు ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ల పట్ల ఖాతాదారులను అప్రమత్తం చేయడం, వినియోగదారుల్లో అవగాహన కలిగించడంతో మోసగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారని అన్నారు.

ఏమిటీ స్కిమ్మింగ్‌…?

ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని తస్కరించడాన్ని ‘స్కిమ్మింగ్‌’ అంటారని, ఇలా కార్డుల సమాచారాన్ని చౌర్యం చేయడానికి ఉపయోగించే పరికరాలను స్కిమ్మర్‌ పరికరాలు అంటారని తెలిపారు. ఎంపిక చేసుకున్న ఏటీఎంలలో మోసగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమరుస్తారని, కస్టమర్లు ఏటీఎం ద్వారా నగదు తీసుకునేందుకు కార్డును స్వైప్‌ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్‌ నంబర్‌ స్కిమ్మర్‌ సంగ్రహిస్తుందని తెలిపారు. సేకరించిన సమాచారంతో మోసగాళ్లు ఆ తర్వాత నగదు ఉపసంహరిస్తున్నారని అన్నారు. దీని కోసం కూడా పలు దారులు ఎంచుకుంటున్నారని, ప్రధానంగా నకిలీ కార్డులను తయారుచేసి సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదు తస్కరిస్తున్నారని పేర్కొన్నారు.

మనమేం చేయాలి..

ఏటీఎంలో కార్డు రీడర్‌పై స్కిమ్మర్లను అమరుస్తారని, దీంతోపాటు ఏటీఎం పిన్‌ తెలుసుకోడానికి కీప్యాడ్‌కు వ్యతిరేకంగా పైభాగంలో చిన్న కెమెరాతో కూడిన స్కానర్‌ను కూడా ఉంచుతారని, ఏటీఎంలకు వెళ్లినప్పుడు ఇలాంటి పరికరాలు ఏవైనా ఉన్నాయో పరిశీలించడం ఉత్తమని తెలిపారు. నగర శివార్లలో ఉండే, జనసంచారం ఎక్కువగా లేని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. పిన్‌ టైప్‌ చేసేటప్పుడు అరచెయ్యి అడ్డుపెట్టుకోవడం సురక్షితమని, నగదు విత్‌డ్రా చేయగానే మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చేలా ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌లు పెట్టుకోవాలని వివరించారు. చాలా మంది కస్టమర్లు ఫోన్‌ నంబర్లను మార్చేసినా..ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారని, ఫోన్‌ నంబరు మార్చితే తక్షణమే బ్యాంకు ఖాతాకు కొత్త నెంబరును అనుసంధానం చేసుకోవడం మరచిపోవద్దుని తెలిపారు. మన ఖాతా నుంచి మన ప్రమేయం లేకుండానే నగదు ఉపసంహరణ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి ఏటీఎం సేవలను స్తంభింప చేసుకోవాలని చెప్పారు. వెంటనే సంబంధిత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.

raithu samagra serveylo vivaralu namodu chesukovali, రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి

రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర రైతు సర్వేలో నూతన పట్టాదారు పాస్‌ పుస్తకం పొందిన ప్రతి రైతు వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో కావ్య తెలిపారు. రైతు సమగ్ర సర్వేలో భాగంగా బుధవారం మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో స్థానిక గ్రామ పంచాయితిలో రైతులకు సమగ్ర సర్వే నమూనాలు అందించి వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 30 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో రైతుల భూములకు సంబంధించిన నీటి వసతులు, భూముల రకాలతోపాటు రైతుల ఆధార్‌, మొబైల్‌ నంబర్ల, బ్యాంక్‌ పాసు పుస్తకం జిరాక్సులను ప్రధానంగా సేకరిస్తున్నట్లు తెలిపారు.

21na sravs advaryamlo 10k run, 21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌

21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌

ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన 10కె మారధన్‌ రన్‌ నిర్వహిస్తున్నామని నిర్వాహాకురాలు స్రవంతిరెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ ఐఎంఎ, బంధన్‌ సెరిమిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో ఈ 10కె రన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రన్‌ ఈనెల 21వ తేదీ ఉదయం 5.30గంటలకు సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ రన్‌లో పాల్గొనదలిచిన వారు 500రూపాయలు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. పాల్గొన్న వారికి టి-షర్లు, బిడ్‌ నెంబర్‌, సర్టిఫికేట్‌, మెడల్‌, పండ్ల రసాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ హాజరవుతారని తెలిపారు. ఈ రన్‌లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5వేల రూపాయలు, తృతీయ బహుమతిగా మూడువేల రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఆదాయాన్ని తలసేమియా బాదితులకు అందజేస్తామని ఐఎంఎ రెసిడెంట్‌ నల్ల సురేందర్‌రెడ్డి, బంధన్‌ డైరెక్టర్‌ శ్రవన్‌, స్రవంతిరెడ్డి, టీంసభ్యులు సంగీతనాయుడు, మాధవి తెలిపారు.

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.

నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో హమాలి, కూలి గంప, చీపురు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని టీఆర్‌ఎస్‌ కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. బుదవారం తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ టీఆర్‌ఎస్‌ కేవీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కార్మికులు భోజనం చేయడానికి తీసుకువచ్చిన భోజనాలు ఎత్తుకు వెళ్తున్నాయని, వాటి రక్షణకోసం కార్మికులు సామానులు భద్రపరుచుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని, హామాలి కార్మికులకు సైకిల్‌ స్టాండ్‌ ఏర్పాటు చేయాలని, మహిళ కార్మికులు మూత్రవిసర్జనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యేక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రివేళలో కాంటాలు జరుగుతున్నందున యార్డులో విద్యుత్‌ లైట్స్‌ లేక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాలని చైర్మన్‌ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్‌ జిల్లా ఇంచార్జి కొల్లూరి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పాలడుగు రమేష్‌, డివిజన్‌ అధ్యక్షులు బలం ప్రసాద్‌, కార్మికులు మాదాసి భారతమ్మ, ఈశ్వరమ్మ, చిలకమ్మతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version