Category: తాజా వార్తలు
congress mptc abyarthi atmahatyayatnam, కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
ఓడిపోతానన్న భయంతో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి, పురుగుల మందు తాగారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో జరిగింది. కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాచర్ల రాములు అప్పులపాలయ్యారు. దీనికి తోడు గెలిచే అవకాశం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు, నిద్రమాత్రలు మింగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాములును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాములు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. తన భర్త రాములు ఏడేళ్లు టీఆర్‌ఎస్‌లో పనిచేసినా ఆ పార్టీ మోసం చేసిందని దుర్గ ఆరోపించారు. ఎంపీటీసీ అభ్యర్థిగా ఇంటిపెండెంట్‌గా బరిలోకి దిగిన తన భర్తకు కాంగ్రెస్ బి-ఫారమ్ ఇచ్చిందని అన్నారు. పలువురు సూటీపోటీ మాటలకు తోడు అప్పులపాలయ్యామన్న బాధతో పురుగులమందు తాగాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
bavi thavakam prarambham, బావి తవ్వకం ప్రారంభం
బావి తవ్వకం ప్రారంభం
వేసవికాలంలో గ్రామపంచాయితీ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని తవ్వడానికి పనులు ప్రారంభించామని గ్రామ సర్పంచ్ గోడిశాల మమత సదానందంగౌడ్ తెలిపారు. మంగళవారం నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని గ్రామసర్పంచ్ చేతుల మీదుగా బావి తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించామని చెప్పారు. గ్రామంలోని ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆముదాల రమేష్, కొప్పు రాందాస్, గోడిశాల శ్రీనివాస్, గ్రామ నాయకులు మాటూరి రవీంద్రాచారి, ఏడ రమేష్, ఆవారి కన్నయ్య, మార్థ నవీన్, వేముల వేణు, బొడుసు స్వామి, నామాల రామయ్య, మచ్చిక రాజులతోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
mruthula kutumbalaku bima sahayam, మతుల కుటుంబాలకు భీమా సహాయం
మతుల కుటుంబాలకు భీమా సహాయం
నర్సంపేట మండలం కమ్మపల్లి మండలంలోని నేతాజీ పురుషుల పొదుపు సంఘంలో సభ్యులుగా ఉంటూ ఇటీవల మతిచెందిన దామెర స్వామి, గడ్డం అశోక్‌ల నామినీలు (కుటుంబసభ్యులకు) అభయ నిధి పథకం, సామూహిక నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి 55వేల రూపాయల చొప్పున ఆ సంఘ అధ్యక్షుడు సాంబరాతి రమేష్ ఆధ్వర్యంలో, దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు నీలా రవీందర్ చేతుల మీదుగా బీమా పథకాల డబ్బులను వారికి మంగళవారం సంఘ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు పెండ్యాల మల్లేశం, రాము, రాజు, లింగారెడ్డి, రవి, శ్రీనివాస్‌రెడ్డి, సాంబయ్యలతోపాటు సంఘ గణకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
vidyardulaku andaga youth for swach duggondi, విద్యార్థులకు అండగా యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి
విద్యార్థులకు అండగా యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటికీ అండగా ఉంటామని యూత్ ఫర్ స్వచ్చదుగ్గొండి అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి శానబోయిన రాజ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం పట్ల దుగ్గొండి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్‌తోపాటు వివిధ రకాలుగా సహాయం అందించిన సందర్భంగా వాటిని ఉపయోగించుకుని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్ కోసం ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన కోరారు. యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి ఎప్పటికి అందుబాటులో ఉంటుందని, త్వరలో ప్రభుత్వం నిర్వహించే బడిబాట కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన అధ్యాపక బందాలకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు బాలకష్ణ, మోడెం విద్యాసాగర్‌గౌడ్, శివ, ప్రతాప్, రమేష్, కిషోర్, రాజేందర్, వేణు, యాదగిరి సుధాకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
taskforce headconistable mruthi, టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్ అలియాస్ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోగా హన్మకొండలోని మాక్స్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. మ్యాక్స్‌కేర్ వైద్యుల సలహా మేరకు కరాటే శ్రీనును మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో కరాటే శ్రీనుకు చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కరాటే శ్రీను గతంలో హసన్‌పర్తి, హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లలో సైతం విధులు నిర్వహించారు. వీరు 1992బ్యాచ్‌కు చెందినవారు. వీరి తోటి బ్యాచ్ మెంట్స్, తోటి సిబ్బంది వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.
taskforce headconstable mruthi, టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్ అలియాస్ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోయారు. దీంతో కరాటే శ్రీనును హన్మకొండలోని మాక్స్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని, చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ పరమపదించారు. కరాటే శ్రీను గతంలో హసన్‌పర్తి, హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లలో సైతం విధులు నిర్వహించారు. వీరు 1992బ్యాచ్‌కు చెందినవారు. వీరి తోటి బ్యాచ్ మెంట్స్, తోటి సిబ్బంది వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.
ajancy mandala toperga gayatri, ఏజెన్సీ మండల టాపర్‌గా గాయత్రి
ఏజెన్సీ మండల టాపర్‌గా గాయత్రి
ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బాలసాని నరేంద్ర కుమార్తె బాలసాని గాయత్రి పదవ తరగతి పరీక్షల్లో మండల టాపర్‌గా నిలిచింది. సోమవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వెంకటాపురం మండలంలోని భారతి విద్యానికేతన్ స్కూల్‌కు చెందిన గాయత్రీ 9.8జిపిఎతో ఏజెన్సీ మండల టాపర్‌గా నిలిచింది.
vanda shatham uthirnatha, వందశాతం ఉత్తీర్ణత
వందశాతం ఉత్తీర్ణత
నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులు మొట్టమొదటిసారిగా వందశాతం ఉత్తీర్ణత సాధించి రికార్డును సష్టించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 36మంది విద్యార్థినులు విద్యాభ్యాసం అభ్యసించి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల మాట్లాడుతూ 36మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారని, అందులో వందశాతం ఉత్తీర్ణత సాధించారని, జెట్టీ నిహారిక అనే విద్యార్థిని 9.3 జిపిఎ సాధించి మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు, సహకరించిన అధ్యాపక బందానికి అభినందనలు తెలిపారు.
mathisthimitham leni vyakthi hulchul, మతిస్థిమితం లేని వ్యక్తీ హల్‌చల్
మతిస్థిమితం లేని వ్యక్తీ హల్‌చల్
రద్దీగా ఉండే హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి వీరంగం సృష్టించాడు. దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలకు అడ్డుపడుతూ నానా హంగామా చేశాడు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఫైర్ ఇంజన్‌పై రాళ్లు వేయసాగాడు. అటుగా వెళ్లే పాదచారులను కర్రతో వెంబడించాడు. దాంతో వాహనదారులు, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి ఆ మతిలేని వ్యక్తి పారిపోయి వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తీ విసిరే రాళ్లదాడి నుంచి వాహనదారులు, పాదాచారులు పరుగులు తీశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తి కర్రతో, రాళ్లతో చెలరేగిపోయాడు. ఆ మతిలేని వ్యక్తి బారి నుంచి తప్పించుకునేందుకు జనం రోడ్లపై పరుగులు తీశారు.
intulo chori, ఇంట్లో చోరీ
ఇంట్లో చోరీ
– 35తులాల బంగారం అపహరణ
హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ పాల్పడగా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న 35 తులాల బంగారం అపహరించారని చెప్పారు.
maramathullu, మరమ్మత్తులు
మరమ్మత్తులు
వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించడానికి డివిజన్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులను పునరుద్దరించడానికి కృషి చేస్తున్నామని 22వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వరంగల్‌లోని ఉర్సు ప్రతాప్‌నగర్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులు కార్పొరేషన్ సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తూ వారి పనితీరును పరిశీలించారు. కొద్దిరోజులలో ప్రతి ఇంటికి మంచినీరు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు. పైప్‌లైన్లు లేని ఏరియాలను గుర్తించారు. త్వరలో ఆయా ప్రాంతాలలో మంచినీటి పైపులు వేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు మరుపల్ల రవి, సిబ్బంది లింగయ్య, ప్రకాష్, మరుపల్ల గీత, కళ్యాణపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
paruvuthisuthunna private palu, పరువుతీస్తున్న ప్రైవేట్ పిఎలు
పరువుతీస్తున్న ప్రైవేట్ పిఎలు
ఓ ప్రభుత్వ కార్యాలయం వెళ్లాలంటే అధికారి కంటే ముందు అక్కడ పనిచేస్తున్న అటెండర్‌ను ప్రసన్నం చేసుకోవాలి. అలా అయితేనే పని జరుగుతుంది లేదంటే అంతే సంగతులు. ఆ కార్యాలయంలో ఏ వ్యవహారం గూర్చి సమాచారం. కావాలన్న వారే సమస్తం. ఇది ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. మరీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీస్తే అచ్చం ప్రభుత్వ కార్యాలయాలలాగే ఉంది. ఇక్కడ మాత్రం సూటు…బూటు వేసుకుని చేతిలో రెండు, మూడు సెల్‌ఫోన్లు, ఓ డైరీ, ఏవో కాగితాలు పట్టుకుని ఎమ్మెల్యేల వెనకాలో, మంత్రుల వెనకాలో అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్లు వీరి కంటే ఎక్కువ గర్వంతో దర్పం ఒలకబోసే పిఎలను ప్రసన్నం చేసుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే మీకు ఏ పని కావాలన్న వీరిని మచ్చిక చేసుకోవాలి. వీరు ఏ స్థాయి వరకు ఎదిగిపోయారంటే కొన్ని సందర్భాల్లో తాము పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి ఎదిగిపోయారని ప్రచారం జరుగుతోంది. అందిన కాడికి దండుకునే స్థాయికి ఎదిగిపోయిన ఈ ప్రైవేట్ పిఎలు ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్న కొందరికీ వీరిని వదులుకోవడానికి మనసు రావడం లేదట. తమ వ్యక్తిగత రహాస్యాలు ఎక్కడ బయటపడతాయనో కొందరు వీరిని భరిస్తుంటే, తమ వ్యక్తిగత దందాలు చేసేవారు ఎవరు ఉండరని కొందరు భరిస్తూ వస్తున్నారట. ఇంకొందరు ప్రజాప్రతినిధులైతే నా పదవి, పరపతి ఉపయోగించి ఏదైనా చేయండి మేం చూసుకుంటాం ఫిఫ్టీ…ఫిఫ్టీ అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో ఈ ప్రైవేట్ పిఎలకు అడ్డూ…అదుపు లేకుండా పోయింది. అవసరమైతే ఉద్యోగం పోతుంది. ఇంతకుమించి అయ్యోదేముంది…? సంపాదనే ధ్యేయంగా పనిచేస్తే సరిపోతుందని ఇష్టారీతిన వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీఎం కట్టడి చేసినా…!
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతరుల పిఎల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కట్టడి చేసే ప్రయత్నం చేసినా ప్రజాప్రతినిధులు మాత్రం వినడం లేదు. పిఎల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలని చెప్పినా విన్నట్లే విని వారికి తోచిన వారిని పిఎలుగా నియమించుకుని తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా కొంత సిబ్బందిని కేటాయించిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలైతే అదనంగా నలుగురు, ఐదుగురిని తమ పిఎలుగా నియమించుకున్నారు. వీరు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనిచేస్తున్నామని అన్ని వ్యవహారాల్లో తలదూర్చుతున్నట్లు తెలుస్తోంది.
పిఎ షరతుకు తలొగ్గిన సీనియర్ మంత్రి…?
టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా కొనసాగుతూ శాఖ మారిన రెండోసారి మంత్రి పదవి దక్కించుకున్న ఓ సీనియర్ మంత్రి తన వద్ద గతంలో పనిచేసిన పిఎ షరతుకు తలొగ్గి మరోమారు పిఎగా నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పనిచేసినప్పుడు ఈ పిఎ ఎన్నికల సమయంలో సీనియర్ మంత్రికి మూడున్నర కోట్ల రూపాయల ఎన్నికల లెక్క చూపలేదట. దీంతో కోపం వచ్చిన సీనియర్ మంత్రి రెండోసారి పిఎగా తీసుకోవడానికి ససేమిరా అన్నాడట. అయితే గతంలో ఓ మంత్రి వద్ద పిఎగా పనిచేసిన వ్యక్తితో కలిసి సీనియర్ మంత్రిని కలిసి తమరి వ్యక్తిగత పనులు, డబ్బుల వ్యవహారం, భూముల వ్యవహారం, సెటిల్‌మెంట్లు అన్ని తామే చూసుకుంటామని, తమరి చేతికి మట్టి అంటకుండా పనిచేసి పెట్టి ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉంచుదామని నమ్మబలకడంతో ఈ ఇద్దరిని సీనియర్ మంత్రి పిఎలుగా నియమించుకుని వ్యవహారం నడిపిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. సీనియర్ మంత్రికి సంబంధించిన సంపాదన, ఆర్థిక విషయాల్లో వీరు జోక్యం చేసుకుని పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు పిఎల్లో ఓ పిఎ గతంలో ప్రముఖ మీడియా చానల్లో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆ పరిచయాలతో తనకు భారీ లాభం చేకూర్చుతాడని తన జోక్యం లేకున్నా బద్నాం కాకుండా వెనకేయవచ్చని సీనియర్ మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రైవేట్ పిఎల వ్యవహారం అటు పార్టీకి, ఇటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో తలదూర్చి సర్వం తామే అన్నట్లు వ్యవహారించే ఈ పిఎల వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధిని కలవడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో వీరి చేతివాటం విమర్శలకు గురి అవుతుంది. ఎంతైనా ప్రభుత్వం వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
bukabzadarulapia pd act, భూకబ్జాదారులపై పీడీ యాక్ట్
భూకబ్జాదారులపై పీడీ యాక్ట్
తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమున్న, వేగంగా వద్ధి చెందుతూ స్మార్ట్ సిటీగా ఎంపికైన కరీంనగర్ పట్టణంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని సామాన్యులు కలలు కనడం సహజం. ఈ కారణంగా, ఇటీవల కరీంనగర్ పట్టణంలో, శివారు ప్రాంతాల్లో భూమి విలువ అమాంతంగా పెరగడం వల్ల ఆ డిమాండ్‌ను తమకు లాభాలుగా మార్చుకోవాలని స్వార్థంతో, దురుద్దేశంతో భూకబ్జాదారుల కన్ను భూములపై పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు తమ పిల్లల భవిష్యత్తు, చదువులు, పెళ్లిళ్ల కోసం ఉపయోగపడుతుందని ఎంతో కొంత భూమి కొనుగోలు చేసి భవిష్యత్ అవసరాల కోసం పెట్టుకోగా ఆ భూములపై కన్నేసిన కొంతమంది భూకబ్జాదారులు తమకు ఉన్న పరిచయాలు, అనుభవంతో తప్పుడు కాగితాలు సష్టించి, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆ భూములను కబ్జాలకు ప్రయత్నిస్తూ, నిజాయితీగా భూమి కొనుగోలు చేసిన యజమానులను, భూకబ్జాదారులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల పోలీసుల దష్టికి వచ్చింది. సామాన్య ప్రజానీకానికి నిజమైన యజమానుదారులకు ఇబ్బందులు కలుగజేస్తూ భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని వారి ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నడుం బిగించారు. ఏప్రిల్ 25వ తేదీన కరీంనగర్ పట్టణంలోని రామచంద్రాపూర్ కాలనీలో సర్వే నంబర్ 965లో కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 2010లో రెండు గంటల స్థలాన్ని కొనుగోలు చేసినాడు. ఆ భూమిని అప్పటినుండి తన స్వాధీనంలోనే ఉండగా అతను 25 ఏప్రిల్ 2019 రోజున ఉదయం గహ నిర్మాణం కోసం శ్రీనివాస్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నిర్మాణ పనులు చేసే ప్రయత్నం చేస్తుండగా ఆ భూమిపై కన్నేసిన భూమాఫియాకు చెందిన భూకబ్జాదారులు 1) సర్దార్ రాజ్‌బీర్‌సింగ్ 2) రాపల శంకర్ 3) సర్దార్ యశ్పాల్‌సింగ్ 4) బొంతల ప్రవీణ్‌కుమార్‌లు దాడిచేసి అతడిని తీవ్రంగా గాయపరచడమే కాకుండా అడ్డువచ్చిన కుటుంబసభ్యులపై కూడా దాడిచేశారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీస్ కమీషనర్ ఇటువంటి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి భూమిని కబ్జా చేయడమే కాకుండా బాధితులపై దాడి చేసినందుకు భూమాఫియా సభ్యులను వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. భూబాధితులను బెదిరిస్తూ అక్రమంగా కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కళ్లెం వేసేందుకు కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహారించి సామాన్యులకు, భూబాధితులకు భరోసా కలిగించాలనే లక్ష్యంతో పోలీసులు ముందుకు నడుస్తున్నారు. అందులో భాగంగానే చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడికి పాల్పడిన నలుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. అంతేకాకుండా భూకబ్జాలకు పాల్పడుతూ సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్న భూ మాఫియాదారులు, భూకబ్జాదారుల వివరాలను సేకరించి వారితో ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమీషనర్ కమలాసన్‌రెడ్డి భవిష్యత్తులో భూ ఆక్రమణలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.
DIEO karyalayamlo…eam jaruguthondi, డిఐఈఓ కార్యాలయంలో…ఏం జరుగుతోంది..
డిఐఈఓ కార్యాలయంలో…ఏం జరుగుతోంది..
వరంగల్ అర్బన్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులదే హవా నడుస్తున్నదని, వారు చెప్పిందే వేదంగా కార్యాలయ సిబ్బంది నడుచుకోవాలని, ఎదురు మాట్లాడినా…వారి పనులకు అడ్డు తగిలే ప్రయత్నం చేసినా కార్యాలయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, అవినీతికి పాల్పడినా, అక్రమాలకు ఒడిగట్టినా నోరు మెదపకుండా మౌనంగా కూర్చోవాలని ఇతరులపై ఒత్తిడి తెస్తుంటారని సమాచారం. కళ్ల ముందే కార్యాలయంలో అవినీతి జరుగుతున్నా ఎవరికి చెప్పలేక తమలో తాము మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కొందరి మౌనమే వారి ఆగడాలకు, అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోతున్నదని విమర్శలు వెల్లువెత్నుతున్నాయి. క్యాంపుల పేరిట, పేపర్ వాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్, స్టేషనరీ, క్యాంపు నడిచిన సమయంలో రోజువారి కూలీలుగా వచ్చే వారి పైనా, ట్రావెలింగ్ అలవెన్సులు, టిఏ., డిఏల పేరుతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా లెక్కకు మించి బిల్లులు పెట్టి పైసలు కాజేస్తున్నారని విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు తమకు అన్యాయం జరిగిందని ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదును ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లకుండా కాలయాపన చేస్తారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-కాలేజి అనుమతులకు వారిని కలువాల్సిందే..
ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుమతి పొందాలంటే కార్యాలయంలో ముందు వీరినే కలవాలని, అలా కలిస్తేనే పనులు సులువుగా పూర్తి అవుతాయని, లేకుంటే చుక్కలు చూడాల్సిందేనని విస్తృత ప్రచారం జరుగుతున్నది. చేతివాటం ముడితే చాలు కాలేజిలు పాటించాల్సిన నిబంధనలను వీరే పక్కకు బెట్టి అనుమతులను మంజూరు చేయిస్తారు. ఉన్నతాధికారిని సైతం పక్కదారి పట్టిస్తారు. చేతివాటం ముట్టగానే కనీస సౌకర్యాలు లేని కాలేజీలకు కూడా అనుమతులు చకచకా వచ్చేస్తాయి. నగరంలో కనీస సౌకర్యాలు లేకుండా నిబంధనలకు విరుద్దంగా అనేక కాలేజీలు నడుస్తున్నాయని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.
thalasemiya baditha baludiki vitharana, తలసేమియా బాధిత బాలుడికి వితరణ
తలసేమియా బాధిత బాలుడికి వితరణ
వెంకటాపురం మండలకేంద్రానికి చెందిన కోగిల్ల రాజేష్ అనే బాలుడు కొద్దికాలంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేష్‌కు వైద్యం అందించడంలో కుటుంబసభ్యులు ఇబ్బందిపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురానికి చెందిన యువకుడు బిల్లా తరుణ్ తనకు హరీష్‌రావు అందజేసిన సొమ్ములో 5వేల రూపాయలు బాధిత బాలుడికి అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ 5వేల రూపాయల నగదును బాధిత రాజేష్ తండ్రి రాజుకు అందజేశారు.
pidugupadi gorrelakapari mruthi, పిడుగుపడి గొర్లకాపరి మతి
పిడుగుపడి గొర్లకాపరి మతి
పిడుగుపాటుకు గొర్లకాపరి మత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నర్సంపేట డివిజన్ దుగ్గొండి మండలంలోని గుడ్డెలుగులపల్లె గ్రామశివారులో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లె గ్రామానికి చెందిన మంద రాజయ్య(40) తనకున్న వ్యవసాయంతోపాటు గొర్రెలను పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం గొర్రెలను మేపడానికి ఊరి శివారులోకి వెళ్లాడు. అనుకోకుండా ఈదురుగాలులు భారీగా వర్షం రావడంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు చెట్టుపై పడటంతో రాజయ్య అక్కడికక్కడే మతిచెందాడు. అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే మతువాత పడినట్టు గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపారు. మతునికి భార్య మమతతోపాటు కూతురు స్రవంతి ఉన్నారు.
kagitham recycling andivachina varam, కాగితం రీసైక్లింగ్ అందివచ్చిన వరం
కాగితం రీసైక్లింగ్ అందివచ్చిన వరం
కాగితం నిత్యజీవితంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. టిష్యూ పేపర్ మొదలుకుని, వార్తపత్రిక వరకు కాగితాన్నే వాడుతారు. కాగితానికి ఉన్న ప్రాధాన్యత అంతా…ఇంతా కాదు. ఇది లేనిది ఏ పని నడవదు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రభుత్వ కార్యకలాపాలు నడవాలన్న, పాలనపరమైన పనులు సజావుగా కొనసాగాలన్న, ఏ విషయంలోనైనా మనిషికి భరోసా, నమ్మకం కలగాలన్న పేపర్ ప్రముఖపాత్రను పోషిస్తుంది అనుకున్న విషయాన్ని కాగితంపై ఉంచితే మనిషి మాటకన్న కాగితంపై ఉన్న మాటలే ఎక్కువ విలువను కలిగి ఉంటాయనడంలో ఎంతమాత్రం సందేహం కలగదు. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న పేపర్ మనకు కలప నుంచే లభిస్తుంది. కాగితం తయారీ కర్మాగారాలు కలప గుజ్జు నుంచి కాగితాన్ని తయారుచేస్తారు. కొన్ని కర్మాగారాల యజమానులు కాగితం తయారీ కోసం ప్రత్యేకంగా చెట్లను పెంచి గుజ్జును తీసి కాగితాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా చేసేందుకు అందని సందర్భంలో లేదా మరింతగా కాగితాన్ని తయారు చేసేందుకు వృక్షాలను కొనుగోలు సైతం చేస్తున్నారు. అయితే కాగితం ఉత్పత్తి మూలంగా పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు కాగితాన్ని తయారు చేయడానికి చెట్లే ఆధారంగా కనపడుతున్నాయి తప్ప మరో ప్రత్యామ్నాయమార్గం కనపడడం లేదు. దీని వల్ల చెట్లను కాగితం తయారీకి వాడక తప్పడం లేదని తయారీ కర్మాగార యజమానులు అంటున్నారు. అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మూలంగా, కంప్యూటరీకరణ కారణంగా కాగితం వాడకం తగ్గిందని అంటున్న ఆశించినంత మేర తగ్గలేదు. పైగా కాగితానికి ఉన్న ప్రాధాన్యత అలాగే ఉండిపోయింది. టెక్నాలజీ ఎంతగా వచ్చిన కాగితం వాడకం తగ్గలేదన్నది నిజంగా నిజం. ఇది ఇలా ఉంటే కాగితం తయారీకి కలపను విరివిగా ఉపయోగిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా కాగితం తయారీ పరిశ్రమలో ఓ మార్పు చోటు చేసుకుంది. రీ సైక్లింగ్ ద్వారా పేపర్‌ను ఉత్పత్తి చేయడం కర్మాగారాలు ప్రారంభించడంతో భారీ ఊరట కలిగింది. రీసైక్లింగ్ కాగితం వాడకం విషయంలో వినియోగదారులకు అవగాహన కలగడంతో కలపను గతంలో కంటే చాలా తక్కువగానే వాడుతున్నారు. దీనివల్ల కొంతమేర ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. రీసైక్లింగ్ పేపర్‌ను వినియోగదారులు ఉపయోగించడంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తే ఈ కాగితానికి ఎక్కువ గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల అటు పర్యావరణానికి కానీ ఇటు వృక్షాలకు కానీ ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అందుకే రీసైక్లింగ్ పేపర్ వాడకాన్ని మరింతగా పెంచేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది.
రీసైక్లింగ్‌తో ముప్పు తగ్గుతుంది
– ఠాకూర్ కిషన్‌సింగ్
రీసైక్లింగ్ పేపర్ మూలంగా పర్యావరణానికి ముప్పు తగ్గుతుందని పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఠాకూర్ కిషన్‌సింగ్ అన్నారు. కాగితం వాడకం గూర్చి ‘నేటిధాత్రి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కాగితం తయారీకి ప్రత్యామ్నాయ ముడిసరుకు ఏది లేకపోవడం ఒకింత బాధాకరమేనన్నారు. అయితే పేపర్ ఉత్పత్తిలో రీసైక్లింగ్ రావడం శుభపరిణామం అన్నారు. రీసైక్లింగ్ వల్ల కలప వాడకాన్ని అధికశాతం నియంత్రించవచ్చన్నారు. అయితే వినియోగదారులు సైతం రీసైక్లింగ్ పేపర్ వాడకంలో శ్రద్ద కనబర్చాలని ఈ కాగితంపై అవగాహన పెంచుకోవాలన్నారు.
matti namunala valana eruvula niyanthrana, మట్టి నమూనాల వలన ఎరువుల నియంత్రణ
మట్టి నమూనాల వలన ఎరువుల నియంత్రణ
మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్
వ్యవసాయ భూములల్లో మట్టి పరీక్షలు చేయించుకోవడం వలన ఎరువుల నియంత్రణను అరికట్టవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్ అన్నారు. శుక్రవారం దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ సుస్థిర వ్యవసాయ పథకం కింద నూతనంగా ఏర్పాటైన చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీని ఈ పథకంలో భాగంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా 224మట్టి నమూనాలను సేకరించారు. వ్యవసాయశాఖ అధికారి దయాకర్ మాట్లాడుతూ మట్టి పరీక్షలు చేయించడం వలన భూమిలో ఎరువులు ఎంత మేరకు వేసుకోవచ్చు అని నిర్ధారణ వస్తుందన్నారు. ఎరువులు మోతాదులో వేయడం వలన అధిక దిగుబడులు వస్తాయని, భూసారం దెబ్బతినకుండా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు రాజేష్, విశ్వశాంతి గ్రామ రైతులు కేశవరెడ్డి, సుధాకర్ రెడ్డి, కొమ్మాలు, కక్కెర్ల శ్రీనివాస్, లక్క రాజు, మదునయ్య, రమేష్, మల్లారెడ్డి, నూనె రాములులతోపాటు పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
leaser cosmotics uchitha vaidya shibiram, లేజర్ కాస్మోటిక్స్ ఉచిత వైద్య శిబిరం
లేజర్ కాస్మోటిక్స్ ఉచిత వైద్య శిబిరం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లేజర్ కాస్మోటిక్స్ ఉచిత వైద్యశిబిరాన్ని శుక్రవారం నర్సంపేట పట్టణంలోని భరత్ డెంటల్, లేజర్ ఆసుపత్రిలో నిర్వహించారు. నర్సంపేట కెఎస్‌ఆర్ మహిళా కళాశాలకు చెందిన ఇరవైమంది విద్యార్థినులకు పులిపిర్లు, నల్లమచ్చలపై లేజర్ చికిత్సను ఉచితంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్‌పర్సన్ డాక్టర్ భరత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో చర్మ వైద్యులు డాక్టర్ విజయ్ మాట్లాడుతూ అత్యాధునిక లేజర్ వైద్య విధానాల వల్ల మనం కోరుకున్న ఫలితాలు వస్తాయన్నారు పులిపిరులు, నల్లమచ్చల కోసం పసర వైద్యం కీడు చేస్తుందని అన్నారు. మహిళలు చర్మ సౌందర్యం కోసం లేజర్ స్పెషలిస్టులను సంప్రదించి ఆత్మవిశ్వాసం పొంది విజయం సాధించాలన్నారు. ఎండ తాకిడి నుండి చర్మ రక్షణకు సన్క్రీమ్ లోషన్ వాడాలన్నారు. యూవీ కిరణాల ప్రభావంతో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కోశాధికారి రవీందర్ ప్రముఖ వైద్యులు రాజేశ్వర్రావు ఎస్సార్ పారా మెడికల్, కెఎస్‌ఆర్ విద్యార్థినులు పాల్గొన్నారు.
