వైభవంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఉదయం నాలుగు గంటలకి సుప్రభాతంతో స్వామివారికి ప్రత్యేక అలంకరణలో తులసీ మాల తో పూలమాలలతో అలంకరించడం జరిగింది శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారు ఉత్తర ద్వారాదర్శనం గా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది పూజా కార్యక్రమం అనంతరం గణపురం వాస్తవ్యులైన విశ్వ భారతి విద్యాసంస్థ నిర్వాహకులు బందారపు సంధ్యారాణి యాదగిరి గౌడ్ ఆలయ అభివృద్ధికి 10116 రూపాయలను ఆలయ కమిటీకి అందజేశారు అదేవిధంగా మార్క భద్రమ్మ రమేష్ దంపతులు ఆలయానికి 5116 ఆలయ కమిటీకి అందజేశారు అదేవిధంగా ఆలయానికి తిప్పని జయ సారయ్య బాలకృష్ణ చైత్ర భానుచందర్ దంపతులు ఆలయానికి బీరువా ను బహుకరించారు అదేవిధంగా దొడ్డిపాటి లావణ్య చంద్రశేఖర్ ఆలయానికి గోడ గడియారం బహుకరించారు పూజానంతరం భక్తులకు అర్చకులు ముసునూరి నరేష్ ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది ఈ పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీఅధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ వడ్లకుంట నారాయణ గౌడ్ బూర రాజగోపాల్ గౌడ్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బటిక స్వామి మూల శ్రీనివాస్ గౌడ్ దయ్యాల భద్రయ్య బండారు శంకర్ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు