కమలాపూర్ సిఐ హరికృష్ణ
నేటి ధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలాపూర్ మండలంలోని పలు విత్తన దుకాణాలను శనివారం కమలాపూర్ సిఐ హరికృష్ణ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు.మరిపెల్లి గూడెంలోని పలు విత్తన దుకాణాల్లోని రికార్డును పరిశీలించి,పలు సూచనలు చేశారు. రైతులు పత్తి విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, వ్యాపారులు విత్తన నిల్వ పట్టికను తెలియపరచాలని, విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతుకు కచ్చితంగా రసీదును అందించాలని సూచించారు.నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై కేస్ లు నమోదు చేసి,వ్యాపార సంస్థలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.ఈ తనిఖీల్లో మర్రిపల్లిగూడెం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ వర్మ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.