ఘనంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు.
రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :-
మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభివృద్ధికి నిదర్శనమని ఆయన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని మాజీ జడ్పిటిసిలు లింగాల జగదీశ్ చందర్ రెడ్డి, మారుజోడు రాంబాబు,బొల్లం మణికంఠ అజయ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ అన్నారు. సోమవారం స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన సందర్భంగా రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారని అదే విధంగా రానున్న రోజుల్లో కూడా రఘునాథపల్లి మండలానికి నిధులు ఇచ్చినందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి జ్యోతిరావు పూలే హాస్టల్ మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా సబ్ స్టేషన్ కూడా మంజూరు అయిందని వారు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రైతు బీమా రెండు లక్షల రూపాయలు మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు రానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు గంగిడి నరసింహారెడ్డి, చీమలపాటి రవీందర్, మాజీ ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె రమేష్ పటేల్,గాదే మహేందర్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు పేర్ని ఉషా రవి,రచ్చ సోమనాథ్, జీడికంటి రాజకుమార్,కొమురెల్లి,మండలంలోని వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.