# కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకుడు బీసీ నేత సాయిలి ప్రభాకర్
వరంగల్ జిల్లా/గీసుగొండ,నేటిధాత్రి :
బీసీల జీవితకాల వాంఛ కొరోకైన కులగనునకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకుడు బిసి నేత
సాయిలి ప్రభాకర్ అన్నారు.50 శాతానికి పైగా ఉన్న మేమేఎంతో మాకు అంతవాటా అనే మాటను నిజం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదనీ అన్నారు.అనగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే జనాభా లెక్కలు తీయవలసిన అవసరం ఉందన పేర్కొన్నారు.బీసీలు అంటే వెనుకబడిన కులాలుకాదని దేశానికి రాష్ట్రానికి వెన్నెముక వర్గాలని ఉన్నదని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.