నర్సంపేట టౌన్ నేటి ధాత్రి:
నర్సంపేట, డిసెంబర్ 24 : ఆటల వల్ల శారీరక దారుఢ్యం తో పాటు మానసిక వికాసం కలుగుతుందనీ దాంతో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్ పదవ తరగతి విద్యార్థి బి. సిద్దు వరంగల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో డిస్కస్ర్ త్రో లో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందనసభ లో వారు మాట్లాడారు. ఈనెల 16 నుండి 21 వరకు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లులో నిర్వహించిన జిల్లా స్థాయి సీ.ఎం. కప్ ఆటల పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించిన బి. సిద్ధును అభినందించారు. ఆటల్లో ప్రత్యక్ష శిక్షణ ఇచ్చిన పి.ఈ.టి లు భవాని చంద్, వినోద్, రవీందర్ రెడ్డి , గోపి, సుమలత లను ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాక జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగల శక్తి అలవడుతుందని విద్యార్థులకు తెలిపారు. చదువుతోపాటు ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకొని దేశం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్ మరియు ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
