దుగ్గొండి, నేటిధాత్రి :
రాబోయే ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం
దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కందిపెల్లి శంకర్ ,యూత్ అధ్యక్షులు నైనబొయిన రాకేష్ గారి ఆధ్వర్యంలో యువతతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ ఎన్నారై సెల్ అధికార ప్రతినిధి,నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ హాజరైయ్యారు.నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ,అభివృద్ధి పట్ల వివరించాలని సూచించారు.వెంకటాపురం గ్రామానికి 80 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టిన ఘనత అలాగే 60 యేండ్లల్లో ఏ నాయకుడు చెయ్యని అభివృద్ధి పనులను 5 యేండ్లలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక పెద్దన్నకు మాత్రమే ఉందని, ప్రతి ఒక్క యువకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపుకై ఒక సైనికుడిలా పని చేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ కాట్ల కోమల-భద్రయ్య ,ఎంపీటీసీ విజయ-మోహన్ రావు,మండల యూత్ నాయకులు పొగాకు బాలకృష్ణ ,గ్రామ ఉపసర్పంచ్ ఊరటి జయపాల్ రెడ్డి,రైతు సంఘం అధ్యక్షులు ఊరటి రవి, సొసైటీ చెర్మన్ ఊరటి మహిపాల్ రెడ్డి, సోసైటీ డైరెక్టర్ జంగిలి రవి, నాంపల్లి సుధాకర్ ,గ్రామ వార్డ్ సభ్యులు, బొల్ల స్వప్న రమేష్, నాంపల్లి సుధాకర్, బంకా రాజు,ఎస్టీ సెల్. నాయకులు గొర్కటి రాజు,మంద అనిల్,మండల రైతు కోశాధికారి తాళ్లపల్లి వీరాస్వామి సోషల్ మీడియా ఇంచార్జి ఎండీ చాంద్ పాషా మరియు యూత్ సభ్యులు,కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాలుగోన్నారు.