రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేత….
మంగపేట నేటిధాత్రి
ములుగు జిల్లా కేంద్రంలోని మంగపేట మండలం బ్రాహ్మణపల్లి ( పేరకలకుంట) గ్రామానికి చెందిన కోక్కరే నర్సింహరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా 2 లక్షల రూపాయల మంజూరు కాగా ఆ మంజూరైనా 2 లక్షల చెక్కును , ఈరోజు వారి భార్య అయిన కొక్కర సీతమ్మ గారికి చెక్కును జడ్పీ చైర్ పర్సన్ , ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అందజేశారు.
ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ కార్యకర్తల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎట్టి జగదీష్, బ్రాహ్మణపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పాండ శ్రీనివాస్ , వేములపల్లి బిక్షపతి, ఆకుతోట చంద్రమౌళి, రమేష్, పిఎసిఎస్ చైర్మన్ చిక్కుల రాములు, సురేష్, సంతోష్, అంకుష్,తదితరులు పాలుగోన్నారు.