కెసిఆర్ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలకేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి ,శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.
రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గండ్ర రమణారెడ్డి గెలుపుకై కృషి చేస్తామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమిష్టిగా ముందుకు సాగి రమణన్న విజయంలో ముందుంటామనితెలియజేశారు. కెసిఆర్ గారి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ మరోమారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గారి గెలుపుకైసాగుతామని తెలియజేశారు.వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసాని శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
