బిజెపిని వీడి బిఆర్ఎస్ లో చేరిన నాయకులు
బి ఆర్ ఎస్ కండువా కప్పి ఆహ్వానించిన జోగినిపల్లి రవీందర్రావు
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జొగినిపల్లి రవీందర్ రావు సమక్షంలో మంగళవారం రోజున బిఆర్ఎస్ పార్టీ లో చెరిన బిజెపి నాయకులు మంకాళి నాగెస్ కు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జోగిని పల్లి రవీందర్రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మoకాళి నాగేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామని, రాబోయే రోజుల్లో పార్టీ అభ్యున్నతికి, కారు గుర్తు గెలుపు కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధి సంపత్, సెస్ డైరెక్టర్ కొట్టే పెల్లి సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ చిక్కాల సుదాకర్ రావు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగుల నాగరాజు గౌడ్,అనిల్ , తదితరులు పాల్గొన్నారు.