# ఉచితంగా భూముల క్రమద్ధీకరణ చేయాలి.
నర్సంపేట,నేటిధాత్రి :
అధికారంలోకి వస్తే
ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తావని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసనగా నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయము ఎదుట భారత్ రాష్ట్ర సమితి నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకట్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ
ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా క్రమబద్దీకరణ చేయుట విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల మీద వహిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఉచిత ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కేసిందన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నామమాత్రపు ఫీజుతో ఎల్ఆర్ఎస్ కట్టి క్రమబద్ధికరించుకోవాలని దరఖాస్తులు ఆహ్వానిస్తే 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని దీన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కోర్టులో కేసు వేసి అపారని ,ఇప్పుడు అధికారంలోకి రాగానే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతూ 2024 మార్చి 31 లోపు కట్టాలని ఒత్తిడి తీసుకొని రావడం జరుగుతుందన్నారు.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి, బిఆర్టీయు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,మున్సిపల్ కౌన్సిలర్స్ నాగిశేట్టీ పద్మ ప్రసాద్,దేవోజు తిరుమల సదానందం,గాదె రజిత చంద్రమౌళి, రామసహాయం శ్రీదేవి సుధాకర్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి ,బిఆర్ఎస్ పట్టణ పార్టీ నాయకులు రావుల సతీష్,బిరం నాగిరెడ్డి,పెండ్యాల యాదగిరి,చుక్క అనిల్ ,గంప రాజేశ్వర్ గౌడ్, సంపంగి సాలయ్య, పైసా ప్రవీణ్,పల్నాటి సాంబయ్య,దండిగా రమేష్,మంద ప్రసాద్,బండి రమేష్, కొల్లాపురం రాజేష్,పెరుమండ్ల రవి దెంచనాదుల సతీష్,పేరుమండ్ల ప్రభాకర్,అలకుంట మురళి, ఓర్సు నాగరాజ్,రాపోలు వెంకటస్వామి,గొనెల కర్ణకర్, శ్రీనివాస్,పట్టణ మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండీ అఫ్జల్ పాష,పట్టణ బిఆర్ఎస్వి అధ్యక్షులు దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.