గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పోతుల విజేందర్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయటం జరిగింది ఇందులోభాగంగా భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోల్సని లక్ష్మి నర్సింహ రావు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, వీరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో బిఆర్ఎస్ మేనిఫెస్టో లో కెసిఆర్ ప్రకటించిన పాంప్లెంట్ చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ ఓటర్లకు రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తు కు ఓటు వెయ్యాలని వారు చెప్పారు సీనియర్ నాయకులు ఆకుల రవీందర్ ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి మండల ఉపాధ్యక్షులు కేశెట్టి ప్రకాష్ గ్రామ శాఖ అధ్యక్షులు గంపల వేణు వార్డు సభ్యులు కొంపెల్లి శంకర్ మాట్ల ప్రేమ్ గ్రామ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు