వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, బి.ఆర్. బిల్డర్స్ అధినేత బుట్టి రమేష్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరాడు. సోమవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గన్నమనేని రామారావు, గూడూరి మధుల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన ఆయనకు లక్ష్మీనరసింహా రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరానని, రాబోయే రోజుల్లో పార్టీ అభ్యున్నతికి, కారు గుర్తు గెలుపు కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారం కుమార్, గోలి మహేష్, నాయకులు కట్కూరి శ్రీనివాస్, రామతీర్థపు రాజు, కొండ కనకయ్య, రేణికింది అశోక్, గోపు బాలరాజ్, శ్రీనివాస్ యాదవ్, రైకనపేట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.