హసన్ పర్తి/ నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం హసన్ పర్తి బస్టాండ్ సెంటర్లో వర్దన్న పేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు జన్మదిన సంధర్భంగా హసన్ పర్తి మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి అధ్వర్యంలో లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా హన్మకొండ అధ్యక్షులు పింగిలి వెంకటరెడ్డి, కిసాన్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్ రెడ్డి, మహిళ అధ్యక్షులు జోరిక పూల కలసి పుట్టిన రోజు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే నాగరాజు కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు పోరెడ్డీ మహేందర్ రెడ్డి మాట్లాడుతు ఎమ్మెల్యే నూరేళ్ళు సంతోషంగా ఉండాలని హసన్ పర్తి మండలంలో ఉన్న ప్రతీ గ్రామం లో ప్రతి డివిజన్ లో ఎన్నో అభివృద్ది పనులు చేయాలని కోరారు. ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు లో రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు రమేష్, ఆరేళ్ల వెంకట స్వామీ, బండ చంటి రెడ్డి కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చరణ్, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.