పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి… సీఐ రవికుమార్
జమ్మికుంట: నేటిధాత్రి
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ రవి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని వారందరికీ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ఆయనతెలిపారు.శాంతిభద్రతల కోసం ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారని వారందరిని స్మరించుకుంటూ ఈ వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహించే వారోత్సవాలలో భాగంగా గురువారం స్పందన బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బందితో సహా పలువురు యువకులు 30 మంది వరకు రక్త దానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలను కలిసి వారికి కూడా తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతామని అందులో భాగంగానే గురువారం హుజరాబాద్ ఏసీబీ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలీసులు విధుల పట్ల అంకితభావంతో పని చేస్తారని తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసే వాడే నిజమైన పోలీసు అని సిఐ తెలిపారు. మేము ఇచ్చిన పిలుపుమేరకు రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేసిన విలాసాగర్ గ్రామ యువకులకు తనుగుల గ్రామ యువకులకు అందరికీ పేరుపేరునా ఆయన కృతజ్ఞత లు తెలిపారు.
