సిరిసిల్లలో బీజేపీ సంబరాలు

– ప్రధానిగా నరేంద్ర మోడీ, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్
– బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో
సిరిసిల్ల(నేటి ధాత్రి):
భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బిజెపి పట్టణ శాఖ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
సోమవారం గాంధీ చౌక్ లో ప్రధానిగా నరేంద్ర మోడీ, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ లు ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల బిజెపి పట్టణ ఆధ్వర్యంలో పటాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా బిజెపి నాయకులు నాగుల శ్రీనివాస్, ఆడెపు రవీందర్ లు మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోడీ, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ లు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు గర్వకారణం అని అన్నారు. కార్యక్రమంలో గాజుల వేణు, బర్కమ్ నవీన్ యాదవ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పత్తిపాక సురేష్, మ్యాన రామ్ ప్రసాద్, అంజన్న, అనిల్, మోర రవీందర్, కొడం శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!