ప్రజా సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న.
ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
గతంలో వివక్ష కు గురైన మహబూబ్ నగర్ ను ఇకనైనా అభివృద్ధి చేసుకుందాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో చేరికల కమిటి కన్వీనర్ సత్తూరు చంద్రకుమార్ గౌడ్, కో కన్వీనర్ మహ్మద్ సిరాజ్ ఖాద్రీ ఆధ్వర్యంలో, హన్వాడ మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తాజా మాజీ సర్పంచ్ లు ఎఐసిసి కార్యదర్శి, మహబూబ్ నగర్ ఎంపి అభ్యర్థి శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి బిజెపి తో మాత్రమే పోటీ ఉంటుందని, బిఆర్ఎస్ అసలు పోటీ ఇవ్వదని, ప్రజల అవసరాలు గుర్తించి, పేదల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలనీ, టివిలో కనిపించే మోడి ఏ అభివృద్ధి చేయడని ఏ కార్యకర్త కు , ఏ నాయకునికి సైతం మోడీ దర్శనం దొరకదని, ఇంకా సామాన్యుడి సమస్యలు ఎలా పరిష్కారం ఇస్తారని, ఇక అభివృద్ధి ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు .
సంక్షేమం మీద ధ్యాస ఉన్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, అందుకే మూడు నెలల కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు దిశగా ఉచిత బస్సు, 500/- లకే గ్యాస్ సిలిండర్ల, 200 యూనిట్ల విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాల తోపాటు సామాన్యుడికి సంక్షేమం అందుబాటులో ఉండేందుకు 16 కార్పోరేషన్ లను ఏర్పాటు చేశారని, 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారని, అలాగే పాలమూరు యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజ్ , లా కళాశాల ఏర్పాటు కు అనుమతి ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.
సంగం బండ తొలగిస్తే 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని మన పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి , ఒప్పించి సంగం బండ తొలగించేందుకు కేవలం మూడు నెలల్లోనే నిధులు మంజూరు చేయించుకుని వచ్చి ఆ సంగం బండను తొలగించారని ఆయన తెలిపారు. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించే క్రమంలో దివిటీపల్లి గ్రామం దగ్గర ఇంకో ఐటి టవర్ ను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆయన చెప్పారు.
చల్లా వంశీచంద్ రెడ్డి డిల్లీ లో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని జాతీయ స్థాయిలో నాయకులందరితో మంచి సంబంధాలు కలిగి ఉండడం చేత మన మహబూబ్ నగర్ జిల్లా కు ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేయించుకుని తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి చేసుకునేందుకు ఇదే గొప్ప అవకాశం అని ఆయన తెలిపారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, తాజా మాజీ సర్పంచ్ లు, కార్యకర్తలకు ఎంపి అభ్యర్థి శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి తో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో చల్లా వంశీచంద్ రెడ్డి, మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, చేరికల కమిటి కన్వీనర్ సత్తూరు చంద్రకుమార్ గౌడ్, కో కన్వీనర్ మహ్మద్ సిరాజ్ ఖాద్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, నాయకులు ఎన్ పి వెంకటేష్, హనీఫ్ అహ్మద్, మారేపల్లి సురేందర్ రెడ్డి, మైనారిటీ సెల్ చైర్మన్ ఫయాజ్, సుధాకర్ రెడ్డి, డిసిసి కార్యదర్శి కృష్ణయ్య, మహబూబ్ నగర్ మండల అధ్యక్షుడు మల్లు నర్సింహా రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షులు మహేందర్ , లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలి, పెద్ద విజయ్ కుమార్, శ్రీశైలం, నవనీత, వసంత, తదితరులు పాల్గొన్నారు.