నెక్కొండ, నేటి ధాత్రి: టిపిసిసి సభ్యుడు జన్మదిన వేడుకలను నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు భారీగా చేరుకొని రంజిత్ రెడ్డి శాలువాలతో సన్మానించి బర్త్డే కేక్ కట్ చేసి బాణాసంచాతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, జిల్లాఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు తిరుమల్ చౌహాన్, నెక్కొండ మాజీ ఉపసర్పంచ్ కుసుమ కేశవులు, మెరుగు విజయకుమార్, కొల్లి సుబ్బారెడ్డి, కొమ్మ రెడ్డి సుధాకర్ రెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను, అన్వర్ పాషా, రామారావు రాము, ఆవుల శ్రీనివాస్, ఈదునూరి దిలీప్, బక్కి నరేష్, వడ్డే సురేష్, బుద్ధి సంపత్, పలు గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.