భూపాలపల్లి మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

కుందూరుపల్లి, భాస్కరగడ్డలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లి, భాస్కరగడ్డ లో టీయూఎఫ్ఐడీసీ నిధుల నుండి రూ.1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూపాలపల్లి మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. పట్టణవాసుల దాహార్తి తీర్చేందుకు ఇటీవల అమృత్ పథకం 2.0 ద్వారా రూ.18.99 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణం ఇదివరకే చేపట్టినట్లు తెలిపారు. రోజురోజుకు పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో పట్టణ వాసులకు త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు చోట్ల సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను సంబంధిత గుత్తేదారు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మున్సిపల్ చైర్మన్ వెంకరాణి సిద్దు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్ ఏఈ రోజా రాణి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ వార్డ్ కౌన్సిలర్ బానోతు రజిత జిమ్ములాల్ దాట్ల శ్రీనివాస్ ముంజల రవీందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య అంబాల శ్రీనివాస్ పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version