ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భోగ్ భండారో కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ అతను, హిందూ ధర్మం గొప్పతనం ను బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడని ఎమ్మెల్యే కొనియాడారు. బంజారా కులదేవతలకు పూజలు చేసి అనంతరం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను గుర్తు చేశారు. గిరిజన సోదరులకు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.