భద్రాచలం పట్టణం లో ఘనంగా భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

భద్రాచలం నేటి ధాత్రి

అందరికి నమస్కారం, ఈ రోజు నవంబర్ 19వ తేదీన భారత రత్న ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు బ్రిడ్జి రోడ్డు లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి నివాళి కార్యక్రమంలో గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి భారతదేశ వ్యవస్థను, ఆర్థికంగా స్థిమితపరిచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వంగా మలిచి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచి, ప్రజల ఆదరభిమానాలు ధనించిన ఇందిరా గాంధీ ఈ భారత దేశంలో జన్మించటం మనందరి అదృష్టమని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భద్రాచలం నియోజకవర్గం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version