పరకాల నేటిధాత్రి
పరకాలలో ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మరియు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు కోర్టులు ఉన్నాయని ఇక్కడ ఒక అధికారి మాత్రమే పనిచేస్తున్నారని మరియు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పోస్ట్ గత ఏడాది నుండి ఖాళీగా ఉందని పరకాలలో మాకు సీనియర్ సివిల్ జడ్జిల కోర్టు అవసరమని చాలా కాలంగా సబ్ ఆర్డినేట్ స్టాఫ్ పోస్టులు అంటే,స్టెనోగ్రాఫర్,జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులలో జూనియర్ అసిస్టెంట్లు,టిఎల్ఎస్ఎ క్లర్క్ ఖాళీగా ఉంచబడ్డాయని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు న్యాయ సహాయ సలహాదారు నియామకం చేయాలనీ కోర్టు హాలులో సరిపడా ఫర్నిచర్ కేటాయించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ కు పరకాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.భద్రయ్య వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూకట్ల శ్రీనివాస్,రాజమౌళి,శ్రావణ్ కుమార్,రాహుల్ విక్రమ్,ప్రవీణ్,ఎజీపి సాబీర్ తదితరులు పాల్గొన్నారు.
జస్టీస్ సుజయ్ ని కలిసిన పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు భద్రయ్య
