శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న భద్రాది రామయ్య

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం:ఏప్రిల్ 16
భ‌ద్రాచలంలో శ్రీ సీతా రాముల కల్యాణానికి శ్రీరామ దివ్య క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపు సీతారాముల కల్యా ణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.ఈరోజు జరిగే శ్రీ రామన వమి కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏర్పా ట్లు చురుగ్గా జరుగుతున్నా యి. రామాలయ ప్రాంగణా న్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు.

నేడు ఎదురుకోలు వేడుక‌…
భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు మిధిలా స్టేడియంలో సీతా రామ కల్యాణం జరగనుం ది. రేపు సీతారామ కల్యా ణం… సీతారామ కల్యాణం సందర్భంగా పెద్దయెత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుం టున్నారు.

ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పటికే భద్రాద్రి బాట పట్టారు. భద్రాచలంలోని అన్ని వసతి గృహాలు బుక్ అయి పోయాయి. సీతారామలు కల్యాణాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.

ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో అందుకు తగినట్లు చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలు మూలల నుంచి వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ సారి స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి వచ్చే వీలు లేనట్లు తెలు స్తోంది.రూ.3 కోట్ల వ్యయం..
దేవాదాయ శాఖ రూ.2.88 కోట్లు, గ్రామ పంచాయతీ రూ. 26 లక్షలు, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం రూ.3 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.

స్వామి వారి కళ్యాణానికి మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో యుద్ధ ప్రాతి పదికన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగమంతా ఏర్పాట్ల లో తలమునకలై ఉన్నారు. రాములోరి కళ్యాణానికి దేశ నలు మూలల నుంచి లక్ష మందికిపైగా భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!