ఏబీఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, బిఆర్ఎస్వి నాయకుల డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి :
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి గాయాలపాలైన విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని ఏబీఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, బిఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుగ్గొండి మండల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలికల)విద్యార్థినిలు(చెన్నారావుపేటలో)ఉన్న గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో నర్సంపేట పట్టణ సమీపంలోని నెక్కొండ రోడ్ కాకతీయ నగర్ వద్ద ఆటో మరియు కారు అదుపు తప్పడం వలన ఆటోలో ఉన్న విద్యార్థినిలు గాయాలు కాగా ఇద్దరు విద్యార్థినిలు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం విద్యార్థి నిమిత్తం అంబులెన్స్ సహాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, బిఆర్ఎస్వి నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యార్థి నాయకులు బోట్ల నరేష్ గడ్డమీద బాలకృష్ణ , నల్ల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే సాంఘిక సంక్షేమ గురుకుల అధికారులు ప్రైవేట్ వాహనాలలో విద్యార్థినిలను తరలించడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు.అందుకు కారణం పట్ల జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులు రమ్య, సంతోషినిలకు మెరుగైన వైద్యం అందించాలని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వివరించిన సాంఘిక సంక్షేమ గురుకుల అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.