చేర్యాల నేటిధాత్రి…
చేర్యల్ మండల్ కేంద్రం లో గల అంగన్వాడీ సెంటర్ లో, భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమం లో భాగంగా అంగన్వాడీ సెంటర్ లో గర్భిణీలకు మహిళలకు ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరియు జెండర్ సమానత్వం, పిల్లల హక్కులు, గర్భస్త శిశు నిర్ధారణ నిరోధక చట్టం-1994, గృహ హింస నిరోధక చట్టం-2005, చైల్డ్ మ్యారేజ్ చట్టం-2006. చట్టాలపై, బాల్య వివాహాలతో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తూ, సుకన్య సమృది యోజన స్కీమ్ మరియు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడీ సేవల గురించి మరియు సమాజంలో జరుగుతున్న అంశాలపై, వాటినుంచి ఎలా పరిరక్షించాలన్న దానిపై వివరించారు. ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి విద్య గొప్పతనాన్ని తెలియజేస్తూ
మహిళల సమస్యల కోసం అందుబాటులో వున్న సఖి సెంటర్ (181), పోలీస్ 100, చైల్డ్ లైన్ 1098 సేవల పై మహిళ సాధికారత బృందం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం అవగాహన సదస్సులో పాల్గొన్న సిద్దిపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ- మహిళా సాధికారత కేంద్రం స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్సియల్ లిటరసీ నాగరాజు గారు జెండర్ స్పెషలిస్ట్ పద్మ మరియు లావణ్య గారు , సూపర్వైజర్ నాగమణి గారు, అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి,గర్భిణీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.