మండల పంచాయితీ అధికారి శ్రీదర్ గౌడ్
కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే..
దుగ్గొండి,నేటిధాత్రి:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో బాగంగా అధికారులు మీ మీ ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలని దుగ్గొండి మండల పంచాయితీ అధికారి మోడెం శ్రీదర్ గౌడ్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల సర్వే రోజురోజుకు కొనసాగుతూ జోరందుకుంటున్నది.ఈనేపథ్యంలో సర్వేలో భాగంగా ఎంపీఓ శ్రీదర్ గౌడ్ మండలంలోని దేశాయిపల్లె గ్రామంలో హాజరైయ్యారు.మండల పరిధిలోని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.
లబ్ధిదారులు తప్పనిసరిగా ఇండ్ల వద్దనే ఉండాలని పేర్కొన్నారు.భూమి ప్రూప్ కోసం కరెంట్ బిల్లు లేదా ఇంటి పన్ను రసీదు ల్యాండ్ పేపర్లులను అందుబాటులో ఉంచుకొని అధికారులకు చూపించాలని శ్రీదర్ గౌడ్ తెలిపారు.