రాజకీయ ఆర్థిక విద్య సామాజిక వెనుకబాటు లేకుండా కృషి చేస్తా,,,,
తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శిగా నియమించిన ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు,,,,
తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శిగా ఎన్నికైన వీరబోయిన యాదగిరి.
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ యువతకు నిరుద్యోగ విద్యాపరంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తానని నూతనంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శిగా నియమించబడ్డ వీరబోయిన యాదగిరి అన్నారు .ఆయన రామాయంపేటలో విలేకరుల మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా బీసీలను వాడుకొని రాజకీయంగా అగ్రవర్ణాలు ఎదగడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు కూడా దేశంలో రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ ఆర్థిక వనరులు కానీ అందకపోవడం విచారకరమన్నారు .ఎన్నో ప్రభుత్వాలు బీసీ జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు .ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన రావలసిన ప్రతి సౌకర్యాన్ని వదిలేది లేదని ఆయన అన్నారు .తనకు విద్యార్థి దశ నుండి జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తో సంబంధాలు ఉన్నాయన్నారు .ఆయన అడుగుజాడల్లోని నడుస్తూ బీసీల అభ్యున్నతికి తీవ్ర కృషి చేస్తానని ఆయన అన్నారు తనకు రాష్ట్ర బీసీ కార్యదర్శిగా నియమించినందుకు బీసీ సంక్షేమ నాయకులకు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో బిసి నాయకులు నీలాద్రి కుస్తీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.