చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి బీసీలకు రిజర్వేషన్లు సరే అధికారం ఎక్కడ! చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మాట ప్రకారం కులగననసర్వే నిర్వహించింది ఈ సర్వేలో 130 బీసీ కులాల జనాభా లెక్క జనాభా 60 శాతం బీసీ జనాభా వచ్చేది. ఈ సర్వే కుట్ర మాజీ మంత్రి జానారెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి బీసీ సర్వే శాతాన్ని తగ్గించి 46% చూపిస్తున్నారు. ఈ కుట్ర 10% ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దయితది అని ఓసిలది 15% పెంచుకున్నారు. బీసీలను కుట్రజేసి 46 శాతానికి చూపిస్తున్నారు. ఈ 46 శాతాన్ని 130 కులాల బీసి జనాభా బీసీ నాయకులు ఎవరు ఒప్పుకోవడం లేదు. దీనిని వ్యతిరేకించడం జరిగింది మళ్లీ రీ సర్వే చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే సాక్షిగా బీసీ కులాలకు కులగనన సర్వే అన్యాయం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలము రిజర్వేషన్ కోసానికి బీసీ హక్కుల కోసం రాజ్యాధికారం కోసానికి ధర్నాలు దీక్షలు పోరాటం చేస్తున్న ఇప్పటివరకు బీసీలకు రాజ్యాధికారం రాలేదు రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారం రాలేదు. ఇప్పుడు బీసీల అందరము ఏకమై బీసీ సంఘాలు మేధావులు సుప్రీంకోర్టుకు అప్లై చేస్తే ఈ కులగణన సర్వే చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. ఈ కుల గణనా సర్వేలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో చర్య తీసుకుని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టారు. ఈ సర్వేలో రెడ్డి మంత్రులు కుట్ర చేసి సర్వే సరిగా చేయకుండా బీసీ జనాభాను తక్కువ చూపెట్టడం జరిగినది. దీనికి బీసీల పక్షాన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నాడు. బీసీరాజకీయ యుద్ధభేరి వరంగల్లో సభ పెడితే ఒక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మా బీసీలందరూ రెడ్డి కులాల వుచ్చదాగి బతకాలని తీన్మార్ మల్లన్నకు కామెంట్ పెట్టినాడు. ఆ ఎమ్మెల్యే కామెంట్ తోని తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయ యుద్ధభేరి సభను నిర్వహించాడు. ఆ సభలో బీసీ ప్రజల ముందు కామెంట్ ను చూపెట్టాడు. అప్పుడు ప్రజల ముందే అతన్ని వ్యతిరేకించాడు మా బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. నా జనాభా శాతం ఎక్కువ ఉన్నాము. ఎవరి ద్వారా ప్రభుత్వం ఏర్పడింది? మా ద్వారా ప్రభుత్వం ఏర్పడ్డది. మమ్మల్ని విమర్శిస్తారా ? అని మల్లన్న మాట్లాడడం జరిగింది. దానికి కావాలని కుట్రతోని రెడ్డి సంఘ నాయకులు మల్లన్న పై రెచ్చగొట్టే కామెంట్లు విమర్శలు చేస్తున్నారు. ఖబర్దార్ రెడ్డి సంఘాలు, మల్లన్న పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు బంద్ చేసుకోవాలి. లేనిపక్షంలో బీసీలందరూ ఏకమై తిరుగుబాటు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మల్లన్న కు, శోకాసు నోటీసులు, వెనక కు తీసుకోవాలి. లేనిపక్షంలో మల్లన్న పక్షాన బీసీలందరం 130 కులాలు ప్రజలు బిసి ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అందరూ కలిసి మల్లన్న పక్షాన పోరాటం చేసి బిసి రాజ్యాధికారాన్నిసాధించు కోవాలని కోరారు.ఈ కార్యక్ర మంలో తీన్మార్ మల్లన్న ఇంట లెక్చువల్ ఫోరం భూపాలపల్లి ఇన్చార్జి పెండ్యాల సంపత్, జిల్లా నాయకులు జంగిలి శ్రీనివాసు, బీసీ రాజ్యాధికార సమితి మండల అధ్యక్షుడు ఉప్పు నరసయ్య, మండల కోశాధికారి మాడిశెట్టి చిరంజీవి, మండల స్టూడెంట్ ఆర్గనైజేషన్ చీరాల రాకేష్ మండల నాయకులు వరుసగా రంగు మహేందర్, బూర లక్ష్మీనారాయణ, ఏం శెట్టి ప్రభాకర్, దిడ్డి రమేష్, వంగరి సాంబయ్య, అంబరి కొండ రాజేశ్వరరావు, నగేష్, తీన్మార్ మల్లన్న టీం జై, వైనాల జంపన్న,బాలయ్య,అడుప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.