చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చిల్పూర్ మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిన్న పెండ్యాల గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి,స్థానిక ఎంపీటీసీ తాళ్లపల్లి ఉమా సమ్మయ్య గౌడ్ లతో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర మహిళలను తోబుట్టువులుగా భావించి బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ కీర్తి అనురాధ, ఫీల్డ్ అసిస్టెంట్ నాగవెల్లి కవిత,స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.
