హోలీ వేడుకలలో పాల్గొన్న భద్రాచలం బంజారా నాయకులు…
భద్రాచలం నేటి ధాత్రి
బంజారాల సాంప్రదాయం అయినటువంటి పండక్కు బంజారా అందరూ కలిసి భద్రాచలం ఐటిడిఏ పి ఓ కు శుభాకాంక్షలు తెలియజేసినారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో బంజారాల సాంప్రదాయమైనటువంటి పండుగ కు బంజారా కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకలలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ హోలీ పండుగలు మన సాంస్కృతిని చాటి చెప్పాయఅన్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసులో వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం ఆనాదిగా వస్తుందఅన్నారు, మన సాంస్కృతి సాంప్రదాయాలను పండగలు చాటి చెబుతున్నాయని పేర్కొన్నారు భారతదేశంలో మనం జరుపుకునే పండుగలు ఎంతో గొప్పవి ప్రతి పండుగకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఆచార సాంప్రదాయాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు, భద్రాచలం మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంజారా సంఘ నాయకులు వి కృష్ణ నాయక్ బి కృష్ణ బి బన్సీలాల్ ఎల్ వెంకటేశ్వర్లు అర్ భాష బి గోవిందు బి వెంకటేశ్వర్లు మదర్ నాయక్ బి బిచ్చ బి తారాచంద్ జి రాందాస్ నాయక్ బి వీరన్న బి జుంకీలాల్ టి మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు