ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ఏ ఐ ఎఫ్ డీ ఎస్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు
నల్లబెల్లి, నేటి ధాత్రి: నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై సి బి సి ఐ డి తో విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏ ఐ ఎఫ్ డీ ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపు మేరకు నల్లబెల్లి మండలకేంద్రంలో ఏ ఐ ఎఫ్ డీ ఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ చేయడం జరిగింది అనంతరం నర్సంపేట డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు. అవుతున్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటిగా మెగా డీఎస్సీ ని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్య హక్కు చట్టాన్ని అమలు చేస్తూ ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్య అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు వాటిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ గత సంవత్సర చార్జీలు మళ్లీ విద్యా సంవత్సరం మొదలైన కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగాప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలో ఫీజుల నియంత్ర చట్టాన్ని అమలు చేసి మండలంలో రెగ్యులర్ ఎంఈఓను నియమించాలని పెండింగ్లో ఉన్న ఫీజు రీయాంబర్స్మెంట్ బకాయిలు 7100 కోట్ల రూపాయలు ఉద్యోగాలు క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని లేనియెడల విద్యార్థులచే ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు రాకేష్ , రమేష్ ,రాజు , మధు, శివ , ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు