సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి రాము డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని..బాల్క సుమన్ చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మండిపడ్డారు. బాల్క సుమన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. తన స్థాయిని మరిచి బాల్క సుమన్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బాల్క సుమన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version