నేటిధాత్రి, వరంగల్
వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఈస్ట్ జోన్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ సీఐ గా, జి. బాబూబల్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రామకృష్ణను ఐజి కు అటాచ్ పంపడంతో ఆ స్థానంలో బాబులాల్ ను నియమించారు. ఈ సందర్భంగా గీసుగొండ సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐ కు, ఎస్‌ఐ లు వెంకన్న, శ్వేతా, సిబ్బంది అభినందనలు తెలిపారు. గతంలో వరంగల్ జిల్లాలో టాస్క్ ఫోర్స్, వరంగల్ ట్రాఫిక్ సీఐ గా జి బాబులల్ పని చేశారు.