ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు!!!
ధర్మపురి నేటి ధాత్రి
సామాజిక న్యాయం కోసం బాబు జగ్జివన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిది అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు,బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా శుక్రవారం రోజున ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జగ్జివన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం జరుగుతుందని,1937లో బీహార్ శాసనసభకు ఎంపికై ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారని, భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని,దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా, రక్షణ, వ్యవసాయం,నీటిపారుదల మరియు రైల్వే వంటి విభిన్న శాఖలను నిర్వహించారని,దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జివన్ గారిని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంటులో బిల్లు ఆమోదంలో వారి కుమార్తె మీరా కుమారి గారు ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందని,ప్రతి ఒక్కరు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో నడవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
