బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్
హసన్ పర్తి / నేటి ధాత్రి
బాబు జగ్జీవన్ రామ్ బహుజనలకు గొప్ప స్ఫూర్తి ప్రధాత అని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.బాబు జగ్జీవన్ రామ్ జయంతిని బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. నలభై ఏళ్ళపాటు భారత పార్లమెంటులో పని చేశారని, ఉప ప్రధానిగా సేవలందించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయంగా దేశ అత్యున్నత స్థాయి పదవులను చేపట్టడం అందరికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు సంకు నర్సింగ్, మాజీ కార్పొరేటర్లు లక్ష్మీ నారాయణ, యాదగిరి, నాయిమోద్దీన్, బాబు రావు, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, జనార్ధన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కనకరాజు, మనోజ్, నాయకులు పరుశురాములు, జానకి రాములు, వీరేందర్, రవీందర్ రావు, చాగంటి రమేష్, విద్యార్థి నాయకులు శ్రీకాంత్, రఘు, రాజశేఖర్, గౌస్ ఖాన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.