యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి
చౌటుప్పల్: బంగారిగడ్డ షాది ఖానా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం నందు ప్రభుత్వ ఆయుర్వేదిక వైద్యశాల ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ ప్రభుత్వం 50 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించబడినది ఈ క్యాంపు నందు రక్తపోటు ,షుగర్, కీళ్ల నొప్పులు ,నడుము నొప్పి, అర్ష మొలలు ,మోకాళ్ళ నొప్పులు ,కంటి సంబంధిత సమస్యలు ,వినికిడి, శ్వాసకోశ వ్యాధులు, జనేంద్రియ, మూత సంబంధిత సమస్యల నివారణ కొరకు రోగానిర్ధాన చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ వేణు రెడ్డి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమము వద్దు లందరూ సద్వినియోగం పరచుకోవాలని ఆరోగ్యమైన జీవితాని పొందాలని కోరారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి ,20వ వార్డ్ కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్ ,సీనియర్ సిటిజన్ మండల శాఖ అధ్యక్షులు కానుగుల వెంకటయ్య ,షాదికాన చైర్మన్ ఎండి ఖరీఫ్ వైద్య బృందం, ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ శ్రీ వల్లి, యునాన్ని డాక్టర్ సల్మాన్ సుల్తానా ,డాక్టర్ గీత ,డాక్టర్ కాటమరాజు, డాక్టర్ నరేష్ తదితర మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.