అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం. పురస్కరించుకుని
1008 తులసి మొక్కల పంపిణీ.
తేదీ: 22/01/2024 (సోమవారం) నాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
అయోధ్య లో శ్రీ రామ జన్మభూమి మందిరం, నందు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఉత్సవం పురస్కరించుకుని ముహూర్త సమయం 12 గంటల 20 నిమిషాలకు భక్తి పారవశ్యాలతో రామ్ లల్లా కు స్వాగతం పలుకుతూ ఎకో గ్రీన్ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో 1008 “తులసి” మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎకో గ్రీన్ పరివార్ సంస్థ కేంద్ర కార్యాలయం అమీర్ పేట్ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ సముదాయాలలో అపార్ట్మెంట్స్ వాసులకు తులసి మొక్కలను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్స్ A.శ్రీనివాసరావు, k.నాగరాజు C.B.ప్రేమానంద్, టెక్నికల్ సభ్యులు బి.కిరణ్ కుమార్,జి.మణిదీప్. ఎస్.ప్రకాష్ రాజ్, జి.శ్రీలేఖ, ఐ. వరలక్ష్మి, నిహారిక,మరియు అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్ కుమార్, ఎల్. రవికాంత్, జి. డింపుల్, ఎల్. సుష్మ, కే.సుష్మ, అనసూయ దేవి, తదితరులు పాల్గొన్నారు, అనంతరం జై శ్రీరామ్ అనే నినాదాలతో హర్షద్వనులతో స్వాగతించడం జరిగింది.