చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు శుక్రవారం పద్మ భవాని సొసైటీ కరీంనగర్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.
ఐ ఈసీ కంపెనీయన్ ప్రోగ్రాంలో భాగంగా సుఖ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ, వాటి నివారణ మార్గాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మ భవాని సొసైటీ ప్రతినిధి సంజీవ్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.