కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ కమిషనరేట్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ కళాశాలలో గంజాయి మరియు మత్తు పదార్థాలు నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి మాధవి హాజరై మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం అత్యంత ప్రమాదకరం యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకూడదని జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈకార్యక్రమంలో సీఐ సరిలాల్, రామడుగు ఎస్ఐ వి.శేఖర్, కళాశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.