మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని డాక్టర్ బి ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాల యందు టీఎస్ కేసి విభాగం వారి ఆధ్వర్యంలో గురువారం ఐఐటీ ముంబాయి వారి సమన్వయంతో తృతీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు స్పోకెన్ ట్యుటోరియల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. సుకన్య మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సాధారణ డిగ్రీ కోర్సులతోపాటు అదనంగా సాధించే సర్టిఫికెట్ కోర్సుల ద్వారా మరింత విజ్ఞా నార్జన జరుగుతుందని, ఆన్లైన్ ద్వారా ఇంటి వద్ద నుంచే నూతన కోర్సులను అభ్యసించ వచ్చని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆంగ్ల విభాగం వారు సతీష్ రెడ్డి బైరెడ్డి, పాల్గొని, విద్యార్థులకు నేటి పోటీ ప్రపంచానికి తగినట్టుగా పోటీ తత్వానికి దురుకోవడానికి సాంకేతిక అవసరమని ఆన్లైన్ విధానం ద్వారా అందిస్తున్న కమ్యూనికేషన్ సి అండ్ సి హ్యాండ్ సి ప్లేస్ ప్లేస్, లిబ్రియో ఆఫీస్ కోర్సులు భవిష్యత్తులో ఉపాధికి బంగారు బాటలు వేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ కే సి కోఆర్డినేటర్ డాక్టర్ బి. నాగలక్ష్మి, కళాశాల పరీక్ష నియంత్రణ అధికారి డాక్టర్ ఎండి. సులేమాన్, టీఎస్ కేసి మెంటర్ వీర ప్రతాప్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.