కొత్త చట్టాలు, పలు సూచనలు చేసిన హసన్ పర్తి సీ ఐ చేరాలు
హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోనీ ఎంజెబిపీఎస్ పాఠశాలల్లో హసన్ పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్ ఐ లు దేవేందర్, రవి, సిద్దయ్య మరియు వారి సిబ్బంది, పిల్లలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు వాడటం వల్ల జరిగే నష్టాలు, కొత్త చట్టాలపై అవగాహన, షీ టీమ్ ప్రాముఖ్యత, 100 నెంబర్ యొక్క ప్రాధాన్యత, సైబర్ నేరాలపై అవగాహన 1930, సోషల్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటి వల్ల జరిగే లాభాలు- నష్టాలు, చైల్డ్ మ్యారేజెస్, సూసైడ్, సీసీ కెమెరాలు ఉపయోగం మొదలగు విషయాల గురించి అవగాహన చేయడం జరిగింది.