-హెల్మెట్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధరించాలి
-చిట్యాల సిఐ దాసారపు వేణు చందర్, మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 1
మండల కేంద్రంలోని చౌరస్తాలో గురువారం చిట్యాల సిఐ దాసరపు వేణు చందర్, మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను చేపట్టి..వాహనదారులకు భద్రత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ వేణు చందర్, మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ లు వాహనదారులనుద్దేశించి మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దన్నారు. వేగం వద్దు..ప్రాణమే ముద్దు, అతివేగంగా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తి కుటుంబాలు వీధిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనాలను నడపాలని, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలను కలిగి ఉండాలన్నారు. లేనియెడల అట్టి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. అనంతరం వాహన తనిఖీల్లో నెంబర్ ప్లేట్స్, డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేసినట్లు వారు తెలిపారు.