నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
వాహన దారులు రోడ్ పై ఎడమ వైపు నకు మాత్రమే ప్రయాణం చేయాలని అలా కాకుండా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తే ప్రమాదాలకు గురి కావల్సి వస్తుందని కమలాపూర్ సిఐ హరికృష్ణ వాహన దారులను హెచ్చరించారు.కమలాపూ ర్ బస్ స్టాండ్ ప్రాంతములో గురువారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు నిర్దిష్ట పరిధిలో ఎడమ వైపున మాత్రమే తమ ప్రయాణం కొనసాగించాలని,అలా కాకుండా రాంగ్ రూట్లో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు వున్నాయని,ఎదురుగా వచ్చే వాహనాలు,పాదచారులు కూడా రాంగ్ రూట్ లో ప్రయాణం చేసే వారి వల్ల ప్రమాదానికి గురి అవుతారని వివరించారు. ఈ కార్యక్రమములో సీఐ తో పాటు పోలీస్ సిబ్బంది,పలువురు వాహన దారులు పాల్గొన్నారు.