ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి-చల్లా ధర్మారెడ్డి
పరకాల నేటిధాత్రి
ఈ ఎన్నికల్లో పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని భారీ మెజారిటీనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల నియోజకవర్గ బి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బుధవారం నియోజకవర్గంలోని సొసైటీ చైర్మన్లు,కమిటీ సభ్యులు,రైతుబందు సమితి మండల,గ్రామ కన్వీనర్లతో హనుమకొండలోని వారి నివాసంలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.ఇప్పటికే బి.ఆర్.ఎస్. మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు.అందరి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని,కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి ప్రజలు ఆగం కావద్దని కోరారు.ఈ కార్యక్రమంలో మండల రైతుభందు కన్వీనర్లు,సొసైటీ చైర్మన్లు,కమిటీ సభ్యులు,మండల కో ఆప్షన్లు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.